Social News XYZ     

“JADOOZ Recline Entertainment” is a sensation in Film industry: Shobana

సినిమా రంగంలో ఇదొక సరికొత్త సంచలనం!!
'జాదూజ్' సహ వ్యవస్థాపకురాలు-ప్రఖ్యాత నటి శోభన

"JADOOZ Recline Entertainment" is a sensation in Film industry: Shobana

కింగ్ నాగార్జున పరిచయ చిత్రం 'విక్రమ్' మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు.

 

'జాదూజ్' సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ 'టి.ఫైబర్'తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్ ఏర్పాటు చేస్తున్న "జాదూజ్ సెంటర్" పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాదూజ్ సహ వ్యవస్థాపకురాలు శోభన, తెలంగాణ ఐటి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, జాదూజ్ ఫౌండర్ సీఈవో రాహుల్ నెహ్రా, జాదూజ్ రీజనల్ పార్టనర్, రిక్లయినర్ సీఇవో, ప్రముఖ నటుడు లోహిత్, జాదూజ్ రిక్లయినర్ బ్రాండ్ అంబాసిడర్, నటుడు శ్రీధర్ రావు పాల్గొన్నారు.

ఇటీవలకాలంలో సామాన్యులకు దూరమై పోయిన సినిమాను వారికి మళ్లీ చేరువ చేయాలనే వజ్ర సంకల్పంతో టి.ఫైబర్ తో కలిసి జాదూజ్ పని చేయనున్నదని ఈ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు.. గ్రామీణులకు విజ్ఞానాన్ని సైతం అందివ్వనున్నామని లోహిత్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాదూజ్ ఎంటర్ టైన్మెంట్స్ కు రిక్లెయినర్ భాగస్వామిగా వ్యవహరించనుందని ఆయన తెలిపారు.

తెలంగాణలోగల 8 వేల గ్రామాల్లో.. తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ నెలకొల్పేందుకు రంగం సిద్ధమైందని. ఈ సెంటర్స్ లో "చాయ్ నాస్తా కేఫ్"లు కూడా ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా వంద మిలియన్ డాలర్ల (సుమారు 700 కోట్ల) ఆదాయంతోపాటు.. అయిదారు వేల మందికి ఆదాయం లభించనుందని రాహుల్ నెహ్రా అన్నారు.

సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే ఇంతటి బృహత్తర కార్యక్రమంలో భాగమైనందుకు గర్వంగా ఉందని, ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ చేరువ కావడం సంతోషంగా ఉందని' సినిమారంగంలో ఇదొక విప్లవం కానుందని శోభన అన్నారు. దీనికి ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల శ్రీధర్ రావు సంతోషం వ్యక్తం చేశారు!!

Facebook Comments
"JADOOZ Recline Entertainment" is a sensation in Film industry: Shobana

About uma

%d bloggers like this: