మెగాస్టార్ అభినందనలతో సినిమా పై మరింత నమ్మకం పెరిగింది - దర్శకుడు గౌతమ్
సారా క్రియేషన్స్ పతాకంపై మొహమ్మద్ అలీ సమర్పణ లో రామ గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీడియాతో ముచ్చటించారు.
మీ గురించి?
ముందుగా చిరంజీవిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన మా సినిమా టీజర్ లాంచ్ చెయ్యడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. చిరంజీవిగారు మా సినిమా గురించి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మా సినిమా యొక్క అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ సినిమాకి ఆలీగారు ఎప్పుడైతే యాడ్ అయ్యారో అప్పటినుంచి చాలా సపోర్ట్ వచ్చింది మీడియా నుంచి బయట పబ్లిక్‌లో కూడా మంచి ఆదరణ వచ్చింది.
ఆలీగారు ప్రెసెంట్స్ మాత్రమేనా? నటిస్తున్నా?
లేదండీ కేవలం ప్రసెంట్స్ మాత్రమే.
దేశంలో దొంగలు పడ్డారు టైటిల్ గురించి?
అది కథే సినిమా చూస్తే తప్పించి నేనేమి చెప్పలేను. ఈ చిత్రంలో నేను తీసుకున్న మొయిన్ పాయింట్ ఏమిటంటే ఈ కథలో ఉన్న ప్రతీ అంశంలోఏదీ జన్యూన్‌గా చెయ్యలేము. కనీసం మన ఆధారకార్డు కూడా జన్యూన్‌గా తెచ్చుకోలేము. అంటే దేశం మీనింగ్ సమాజం అని వస్తుంది. ఈ రోజుల్లో రెగ్యూలర్‌గా మనం పేపర్‌లో చూస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తీసుకున్నా. హ్యూమన్ ట్రాఫికింగ్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్నవ్యక్తులు వారిని తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాము.
ఈ కాన్సెప్ట్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది?
అంటే మా మూవీ జనరల్ గా అమ్మాయి, అబ్బాయి లవ్ కాదు. ఈ కన్సెప్ట్ ఉండడం వల్ల ఇంటర్‌నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. ఈ కాన్సెప్ట్ మొత్తం ప్రతి దగ్గర అందరికీ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఫిలిం ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నాను.
ట్రైలర్ రిలీజ్ అయ్యాక్ రెస్పాన్స్ ఏంటి?
మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసింది. రీసెంట్ కాలంలో ఏ సినిమాకి రానన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. జనరల్‌గా అందరికీ రెగులర్‌గా నచ్చే లవ్ స్టోరీ కాదు. ఎలా ఫిక్స్ అయిందంటే తమిళ్ సినిమాలు డబ్బింగ్ చేస్తే చూడటమే కాదు మన తెలుగులో కూడా మంచి కాన్సెప్ట్ ఉంటే చూస్తారు అన్నట్లుంది.
చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది? విడుదలకి ఇదే కరెక్ట్ టైమా?
ఎప్పుడూ చిన్న సినిమాలు నడుస్తున్నాయి. మనం గుర్తించడం లేదు.
ఆలీగారు తీసుకోవడానికి మెయిన్ రీజన్?
బేసిక్‌గా వాళ్ళ తమ్ముడున్నాడని 100 పర్సెంట్ కాదండి. వాళ్ళ తమ్ముడు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. కాని ఆయన ఏ సినిమా తీసుకోలేదు. ఈ సినిమా ఆయన చూశారు, చూసిన తర్వాత ఈ సినిమా ఆయనకు బాగా నచ్చి ఒకరోజు నన్ను పిలిచి దీన్ని ఏమి చేద్దామనుకుంటున్నావు, ఎలాచేద్దామనుకుంటున్నావు అని అడిగారు. దీనికి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి ఒకవేళ సపోర్ట్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి అని అడిగారు. అప్పుడు నేను ఒకటే అడిగా మీరు దీంట్లో యాడ్ అవ్వండి అని ఆయన చేశారు అనగానే ఆయన తరుపు మాకు సపోర్టింగ్ దొరికింది. చిరంజీవిగారు వచ్చారు. చిరంజీవిగారు కేవలం ఆలీగారికోసమే సినిమా మొత్తం చూశారు. చూడటమే కాదు ఆయన ప్రత్యేకించి సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు నాతో. పర్సనల్‌గా ఆయన నన్ను సినిమా గురించి మెచ్చుకోవడం చాలా ఆనందం అనిపించింది. ఇదంతా కేవలం ఆలీగారి యాడింగ్ వల్లే జరిగింది. అందుగురించి ఆలీగారి హెల్ప్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆలీగారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏది అడిగినా కాదనకుండా ఇస్తున్నారు. రెండోది తమ్ముడికి ఒక సక్సెస్ ఫుల్ సినిమా అని ఆయన ఫీలయి ఉంటారు అందుకోసమే మాకు సపోర్ట్ చేస్తున్నారు.
మాములుగా స్టార్ హీరోలు ఉంటేనే నడవడంలేదు మరి మీరు కొత్తవారు ఏ ధైర్యంతో తీసుకున్నారు?
స్టార్ హీరోలయినా చూడటం లేదు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు.
ఈ సినిమాకి ఎ సర్టిఫికెట్ వచ్చింది? ఆ ఉద్దేశ్యంతోనే పెట్టారా అలా అయితేనే ఆడుతుందని?
జనరల్గా ఏ సర్టిఫికెట్ అయినా ఈ ప్రేక్షకులు చూడాలి. పలానా వాళ్ళు చూడాలి అని. కథ రాస్తున్నప్పుడే తెలుసు ఎ సర్టిఫికెట్ వస్తుందని మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే సినిమా తియ్యలేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో ఇలాంటి కథ రాలేదు. ఈ సినిమా హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చూపిస్తున్నాము. అలా తీసినప్పుడు అలాగే చూపించాలి. మేం చూపించాలంటే ఎ సర్టిఫికెట్తోనే చూపించగలం నేను కాకుండా ఈ ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా ఎ సర్టిఫికెట్‌తోనే తీస్తాడు. అందుకోసమే ముందుగానే ఎ సర్టిఫికెట్ అని ఎనౌన్స్ చేశాం.
పోస్టర్స్ డిఫరెంట్‌గా కార్టూన్‌లాగా డిజైన్ చేయించారు మొహాలు కనపడకుండా?
కార్టూన్‌లాగా ఏమీ కాదు. పోస్టర్స్ మొత్తంలో వాళ్ళ ఎమోషన్స్ కనపడాలి కాని ఫేసెస్ పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉంది. మీరే అన్నారు కదా వీళ్ళెవరూ స్టార్లు కాదు వీళ్ళనుంచి మార్కెట్ అయ్యే మూవీ కాదు. నేను కొత్తవాడ్నే మార్కెట్ కోసం సినిమా తీశాం అమ్మేశాం అని దాని కోసం సినిమా తియ్యలేదు. సినిమాకి జనాలు రావాలి చూడాలి అసలు ఏమి తీశాం అని తెలుసుకోవాలని. అందుకు ఏదో ఒక కొత్త విషయాన్ని కనెక్ట్ చెయ్యాలి అని పోస్టర్స్ ఇలా డిజైన్ చెయించాము.
అందరూ దొంగలే అంటున్నారు సినిమాకి ఎవరు వస్తారు? ఫ‌్యామిలీస్ చూడలేరు అంటున్నారు?
మీరు చెప్పిన క్యాటగిరి కాకుండా వేరే ప్రేక్షకులు ఉన్నారు. గ్యారెంటీగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చూసే వారు ఉంటారు. వాళ్ళకి ఇందులో లిప్‌లాక్స్ ఉన్నాయా, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయా అని ఆలోచించరు. ఇంకా కథ కోసం చూసే ప్రేక్షకులు మిగిలే ఉన్నారు. వాళ్ళు వస్తారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ మీద రీసెర్చ్ చేశారా?
దాని గురించి ప్రత్యేక రీసెర్చ్ ఏమీలేదండీ... రోజూ పేపర్‌లో చూస్తూనే ఉన్నాం. రియల్ ఇన్సిడెంట్లు కావు. మొత్తం అన్నిటినీ చూపించలేను కాబట్టి జనరలైజ్ చేసి సీరియస్‌గా మనింటిలోనే ఒక అమ్మాయికి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ అమ్మాయి ఎమోషన్ ఆ అమ్మాయి లైఫ్ ఎంత స్పాయిల్ అయింది. దానికి ఈ కుర్రాళ్ళకి సంబంధం ఏమిటి అన్నది కథ. ఖయ్యూమ్; షఆనీ ఇంకా ప్రృధ్వీగారు, సమీర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, లోహిత్ అని హ్యూమన్ ట్రాఫికింగ్ సర్కిల్‌లో ఒక వ్యక్తి అందరూ తెలిసిన మొహాలే కాకపోతే లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో జరిగే మూవీ.
సినిమా సస్పెన్స్ థ్రిల్లరా?
లేదు. క్రైమ్ థ్రిల్లర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. సాండీ అనే ఆయన చేశారు. గతంలో కిల్లింగ్ వీరప్పన్‌కి చేశారు.నాకు అప్పటి నుంచి ఆయన బాగా పరిచయం. ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రాఫర్ నాకు ఇంతకు ముందు ఒక సినిమా చేశాము అక్కడ నుంచి పరిచయం ప్యాచ్ వర్క్ తనే చూశారు. ఇద్దరం కలిసే లొకేషన్స్ వెతికాము వైజాగ్ నుంచి సిరియా వరకూ అలా చూపించాము ఛత్తీస్‌గడ్ దగ్గర మొయిన్ పార్ట్ షూట్ చేశాం. నాది వైజాగ్ కావడంతో నాకు ఆ లొకేషన్స్ గురించి బాగా తెలుసు ఇప్పటి వరకూ ఎవరూ చూపించలేదని నా ఫీలింగ్.
బేసిక్‌గా ప్రొడ్యూసర్‌గా కూడా ఈ సినిమాలో పార్ట్ అయ్యాను. ఈ కథ స్టార్ట్ అయినప్పుడు నలుగురు కలిసి చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. చివరకు ఇద్దరం మిగిలాం నేను, సంతోష్. ఇక్కడతనే యూఎస్ వెళ్ళారు ఆయన ప్రొడ్యూస్ చేశారు.
హీరోయిన్ గురించి?
హీరోయిన్ కొత్త అమ్మాయి. ఆ అమ్మాయిని ఆడిషన్ చేసి తీసుకున్నాం. ఒక విధంగా ఈ సినిమాకి అవార్డుకి సెలెక్ట్ అయింది. మొయిన్ కారణం చాలా బాగా సపోర్ట్ చేసింది. మేము చాలా మంది తెలుగమ్మాయిలను ట్రై చేశాం. కానీ ఇందులో హీరోయిన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చెయ్యడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంతో ఆ క్యారెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంది. ఆ అమ్మాయి సూపర్బ్‌గా యాక్ట్ చేసింది. సినిమా చూస్తే చాలా వరకూ ఆ అమ్మాయికి కనెక్ట్ అవుతారు.
ఖయ్యూమ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
నార్మల్గా కొత్తవాళ్ళతో చేద్దామని ఆడిషన్స్‌కి కూడా ప్రిపేర్ అయ్యాం. ఈ అమ్మాయి సెలెక్ట్ అయిన తర్వాత హీరో ఆ క్యారెక్టర్‌కి ఎక్కడా సినిమా మొత్తంలో కామెడీ చెయ్యకూడాదు. ఫన్ చెయ్యకూడదు. రెగులర్‌గా మనం చూసే సినిమాల్లోని ఎమోషన్ అంతకన్నా కాదు. దానికి ఒక పెయిన్ ఉండాలి ఆ ఫీలింగ్ ఒక ఎక్స్‌పీరియన్స్ ఆర్టిస్ట్‌కి మాత్రమే తెలుస్తుందని ఇద్దరి ముగ్గురికి కథ చెప్పాం కథ నచ్చింది. కాని ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ వద్దు వాళ్ళు ఐదు, పదిరోజులు గ్యాప్‌లో చేస్తామన్నారు. అలా చేసే సినిమా ఇది కాదు. ఒక ఫ్లో ఉంటది, ఒక గెటప్ ఉంటది వాటిని క్యారీ చెయ్యగలగాలి. ఖయ్యూంని లాస్ట్ చూసిన రెండు మూడు సినిమాలని ఇప్పటికి చాలా తేడా ఉంటుంది. చాలా బావున్నాడు. హీరోలా మొయిన్‌టెయిన్ చేస్తున్నాడు. మొదటిసారి ఆఫీస్‌కి వచ్చినప్పుడు నేనే చూసి షాక్ అయ్యాను. కెమెరాలో చూసినప్పుడు కూడా నాకు బాగా అర్ధమైంది. అతనిలో చాలా మంచి యాక్టర్ ఉన్నాడు. ఎవరూ సరిగా వాడుకోలేదు అని. లేదంటే ఈ సినిమాలో ఇప్పటివరకూ ఆయన చూపించినంత మొచ్యూర్డ్ యాక్టింగ్ లేదేమో అనుకుంటున్నా. ఈ సినిమాలో మాత్రం ఆయనది చాలా డిఫరెంట్ కైండాఫ్ క్యారెక్టర్.
ఆలీగారు రామ్‌గోపాల్ వర్మగారితో పోల్చారు దాని గురించి?
ఆ లైటింగ్ మీద ఆధారపడి చేయడం వల్ల అంటే పెద్ద బడ్జెట్‌లు, సెటప్‌లు లేవు కాబట్టి ఓ ఆర్ట్ వర్క్‌లు అవీ ఇవీ చెయ్యలేదు. కేవలం లైటింగ్ మీదే ఆధారపడ్డాం. బడ్జెట్‌తో సంబంధం లేకుండా కథ కూడా డార్క్ జోనర్ మూవీ కావడంతో సహజంగా ఆర్జీవీనే గుర్తొస్తారు. అందుకే అని ఉంటారు.
This website uses cookies.