నాగార్జున చెప్పింది నిజమే !
దేవదాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున చెప్పిందే జరిగింది. సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉండడం వంటి అంశాలాతో సినిమా తేలిపోయింది. నాగార్జున, నాని వంటి స్టార్స్ ఉన్నా వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. మణిశర్మ సంగీతం కూడా పెద్దగా వర్క్ఔట్ కాలేదు. వైఉజయంతి మూవీస్ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాకోసం భారీగా ఖర్చు పెట్టారు కానీ కథలో పెద్దగా విషయం లేనందున ఆడియన్స్ ఈ సినిమాను తిరస్కరించారు. .
ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ.. దేవదాస్ సినిమాను మూడురోజుల ముందు చూపించాడు దర్శకుడు, అదే ఒక నెల ముందు చూపించి ఉంటే చిన్న మార్పులు చేసే వాడిని అన్నారు. ఇది నిజమే సినిమా గొప్పగా లేదు అందుకే నాగార్జున ఈ డౌట్ ను ముందే మీడియాతో చెప్పారు. సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య లాస్ట్ సినిమా శమంతకమణి కూడా అలాగే జరిగింది. మంచి ఆర్టిస్ట్స్ చాలామంది ఉన్నా పసలేని కథ కథనాలతో సినిమా తీసి విమర్శలు అందుకున్నాడు.