విబిన్న పాత్రలో అనుస్క !
ఆరంధతి సినిమాతో అనుస్క ఒక్కసారిగా నటిగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా విడుదల తరువాత అమేకు అలాంటి పాత్రలు చెయ్యమని చాలా అవకాశాలు వచ్చాయి. పంచాక్షరీ సినిమా చేసినా కమర్శియల్ గా ఆ సినిమా ఆడలేదు. ఆ మూవీ తరువాత మామూలు సినిమాల్లో నటించింది. తాజాగా భాగమతి సినిమాలో నటించిన అనుస్క ఆ సినిమాతో మరోసారి పెద్ద విజయం సాధించింది.
భాగమతి సినిమా తరువాత అనుస్క చెయ్యబోతున్న సినిమా దసరా పండక్కి ప్రారంభం కానుంది. ఈ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో అనుస్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించబోతోందని సమాచారం. గతంలో అనుస్క పలు మంచి పాత్రల్లో మెప్పించింది. కానీ మొదటిసారి ఇలాంటి విబిన్న పాత్రలో నటించడం విశేషం. హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా పుస్పక విమానం తరహాలో ఉండబోతోందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో నటించే నటీనటుల సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది.
This website uses cookies.