"నువ్వెందుకు నచ్చావె శైలజ " చిత్రం ప్రారంభం
అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.రామకృష్ణ నిర్మిస్తొన్న చిత్రం "నువ్వెందుకు నచ్చావె శైలజ". రోషన్, అనూష జంటగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లొ ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇదొక యాంటీ లవ్ స్టొరీ. ఎలా ప్రేమించాలి, ప్రేమించకూడదన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ప్రేమించాలంటే ఉండాల్సిన అర్హత లను ఇందులొ చూపిస్తున్నాము. నేటి నుంచి రెగ్యలర్ షూటింగ్ ను చెస్తామన్నారు. యూత్ కు కావల్సిన అన్ని అంశాలు ఇందులొ ఉంటాయి.నాలుగు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ కధనంతో ఈ చిత్రముంటుంది. కధ నచ్చి నిర్మాత రామకృష్ణ ఈ సినిమాను తీసెందుకు ముందుకు వచ్చారన్నారు.
మా తొలి సినిమానె ఇలాంటి కాంటెంపరరీ కాన్సెప్ట్ తో చెస్తున్నందుకు సంతోషంగా ఉంది. బ్రేక్ వస్తుందన్న నమ్మకముందన్నారు హీరొ రోషన్ హీరొయిన్ అనూష .
నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. కధ నచ్చి ఈ సినిమాను చెస్తున్నాను. మంచి టీమ్ కుదిరింది. పాపులర్ ఆర్టిస్ట్ లందరు ఈ చిత్రంలో నటిస్తున్నారన్నారు.
ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు వర్క్ చెయటం ఆనందంగా ఉందన్నారు డిఓపి యం. జోషి.
రోషన్, అనూష, బ్రహ్మానందం, పోసాని ,షియాజీ షిండే, ఆశిష్ విద్యార్ది, ధనరాజ్ ,కాదంబరి కిరణ్, సన, మణిచందన, మణి, సూరజ్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డి.ఓ.పి: యం.జోషి, కూర్పు : నందమూరి హరి, ఆర్ట్: విజయకృష్ణ, మేనెజర్స్: బాలాజీ శీను ,సుధాకర్ రావు, నిర్మాత: వి.రామకృష్ణుని, రచన-దర్శకత్వం: నాగేశ్వరావు.