ముంబయి రైటర్ కథతో మొదలైన దేవదాస్ !
దేవదాస్ సినిమా గురించి హీరో నాగార్జున మాట్లాడుతూ... "ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ ముంబాయికి చెందిన ఒక రచయిత చెప్పడం జరిగింది. కథ నచ్చింది. ఆ తరవాత ఆ కథపై చాలా మంచి డైరెక్టర్స్ వర్క్ చేశారు. చివరికి శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు సెట్ అయ్యాడు. శ్రీరామ్ కొంత మంది రైటర్స్ సహాయం తీసుకుని స్టోరీని డెవెలప్ చేసుకున్నాడు. కథకు కావాల్సిన ట్విస్ట్స్ అన్నీ బాగా కుదిరాయి. దాసు పాత్రలో నాని బాగా నటించాడు. అతని పాత్ర ఫన్నీగా ఉండబోతోంది" అన్నారు.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న దేవదాస్ సినిమాకు యు/ఏ సట్టిఫికెట్ లభించింది. కామెడీతో పాటు సినిమాలో సెంటిమెంట్ ఉందని సమాచారం. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవదాస్ ప్రేక్షకులను నవ్విస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. దేవదాస్ సినిమా హిట్ అయితే నాగార్జున మరిన్ని మల్టీస్టారర్ సినిమాల్లో నటించే అవకాశం ఉంది. మణిశర్మ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రీరికార్డింగ్ కూడా సినిమాకు మరో అదనపు ఆకర్షణ కానుందని టాక్.