ప్రభాస్ సినిమాలో కాజల్ ఐటమ్ సాంగ్ !

ప్రబాస్ సాహో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో కాజల్ ఐటం సాంగ్ చెయ్యబోతుందని ఇండస్ట్రి టాక్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక మాస్ సాంగ్ కోసం కాజల్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి కాజల్ ఒకే చెప్పిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వెన్నెల కిశోర్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
సాహోలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో నటింస్తున్నాడు. ఒక పాత్ర నెగిటివ్, మరొకటి పాజిటివ్. భారీ లొకేషన్స్ లో సినిమాను రిచ్ గా తెరకెక్కిస్తున్నారు. జేమ్స్ బాండ్ తరహలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని సమాచారం. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కొత్త ట్రైలర్ ను దసరా పండక్కి విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా తరువాత ప్రభాస్ చెయ్యబోతున్న సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. రాధా కృష్ణ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.