వేర్ ది ఈజ్ వెంకటలక్ష్మి లోగో లాంచ్...
ఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సారథీ స్టూడియోస్ లో జరుగుతుంది. ఇక్కడే ప్రత్యేకంగా ఓ సెట్ వేసి.. లక్ష్మీరాయ్ పై పాపా నీకు ఏదంటే ఇష్టం అనే పాటను చిత్రీకరించారు. సురేష్ భనిశెట్టి రాసిన ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఈ సినిమాలో పాట ప్రత్యేకంగా నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. "రెండు నెలల కింద షూటింగ్ మొదలుపెట్టి.. అమలాపురంలో 20 రోజులు షూటింగ్ చేసాము. పాట చిత్రీకరణ తర్వాత 10రోజులు అమలాపురంలో షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తైతే షూట్ కూడా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళి రోజున సినిమా విడుదల చేస్తాం. లక్ష్మీరాయ్ తనే హీరోగా ఈ సినిమాను నడిపిస్తుంది. పూజిత పాత్ర కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. దర్శకుడు కిషోర్ చాలా అద్బుతంగా తెరకెక్కిస్తున్నాడు. కామెడీ త్రిల్లర్ గా తెరకెక్కుతోంది.. ఖర్చుకు వెనకాడకుండా నా స్నేహితులు శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా" అవుతుందని అన్నారు.
హీరోయిన్ లక్ష్మీరాయ్ మాట్లాడుతూ... "ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ. పాపా నీకేదంటే ఇష్టం పాటను శేఖర్ మాస్టర్ అద్భుతంగా కంపోజ్ చేస్తున్నారు. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు. దర్శకుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన లక్ష్మీ రాయ్, మరియు నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. సబ్జెక్ట్ చాలా బాగొచ్చింది. కామెడీ త్రిల్లర్. ప్రేక్షకులను బాగా నవ్వించాలని చేసిన ప్రయత్నమే ఈ వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ చిత్రం. అమలాపురంలో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.. రింగా రింగా.., రత్తాలు పాటల మాదిరే ఇది కూడా పాపులర్ అవుతుంది. సీనియర్ నటులు కావడంతో అంతా బాగా నటిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నానని" లక్ష్మీరాయ్ చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ... "ఇప్పటికే 70 శాతం సినిమా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాట చిత్రీకరణలో ఉంది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు.. నటీనటులు అందరూ ఎంతో బాగా సహకరిస్తున్నారు... సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నామని" అన్నారు.
లక్ష్మీరాయ్ తో పాటు పలువురు సీనియర్ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలతో పాటు లక్ష్మీ రాయ్, హీరో రామ్ కార్తిక్, హీరోయిన్ పూజిత పొన్నాడ, పంకజ్, కిషోర్, మధుసూదన్, వెంకట్, శేఖర్ మాస్టర్, హరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..
నటీనటులు:
లక్ష్మీ రాయ్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధునందన్, అన్నపూర్ణమ్మ, పంకజ్ కిసారి తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకుడు: కిషోర్ కుమార్(లడ్డా)
నిర్మాతలు: ఎమ్. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: కిరణ్ తటవర్తి,
సంగీత దర్శకుడు: హరి గురువ
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాకామూరి
ఎడిటర్: ఎస్ ఆర్. శేఖర్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఫైట్స్: రామ్ సుంకర
కొరియోగ్రఫీ: శేఖర్, యశ్వంత్
పిఆర్ఓ: వంశీ శేఖర్
This website uses cookies.