Highlight of Vijay Devarakonda’s NOTA movie?

విజయ్ దేవరకొండ నోటాలో హైలెట్ ఇదే !

Highlight of Vijay Devarakonda's NOTA movie?

విజయ్ దేవరకొండ నటిస్తోన్న కొత్త సినిమా నోటా. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలోని ఒక పాత్రపై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్ నటించినట్లు తెలుస్తోంది. మురుగదాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న ఫోటో ఒకటి చిత్ర యూనిట్ ట్విట్టర్ లో విడుదల చేసారు. ఈ సినిమా అధికభాగం తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని సమాచారం.

సినిమా క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి అయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమాకు అదే మెయిన్ హైలెట్ అంటున్నారు. మెహరిన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. గీత గోవిందం సినిమా విడుదల తరువాత విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత పెరిగింది. నోటా సినిమాకు మరింత మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 18న నోటా సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నోటా హిట్ అయితే తమిళ్ లో విజయ్ దేవరకొండ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

Facebook Comments
Share
%%footer%%