Social News XYZ     

2 Friends Movie Trailer Launched by C.Kalyan

సి.కళ్యాణ్ విడుదల చేసిన 'టు ఫ్రెండ్స్' ట్రైలర్ !!

2 Friends Movie Trailer Launched by C.Kalyan

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'టు ఫ్రెండ్స్'. ట్రూ లవ్ అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. తాను నిర్మాతనయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన 'టు ఫ్రెండ్స్' ట్రైలర్ విడుదల చేసే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.

 

నిర్మాత ముళ్లగూరు ఆనంతరాముడు మాట్లాడుతూ.. "విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను.. సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ.. "ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా వచ్చింది" అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు మల్కాపురం శివకుమార్, శోభారాణి, మల్లిడి సత్యనారాయణ రెడ్డి, సాయే దైవం నిర్మాత శ్రీమతి భవాని, ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం సమకూర్చిన పోలూర్ ఘటికచలం, కెమెరామెన్ సురేంద్రరెడ్డి, ప్రముఖ ఫైనాన్షియర్ నారపురెడ్డి, హీరో అఖిల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

ధనరాజ్, స్నిగ్ధ, సమీర్ దత్త, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, సాయిప్రకాష్, సాధు కోకిల, కవిత, రమేష్ భట్, డి.వై.రఘురాం, చిత్ర శెనాయి, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, వై.విజయ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్-వరికుప్పల యాదగిరి-డి.వై.రఘురాం, కొరియోగ్రఫీ: స్వర్ణబాబు, కో-డైరెక్టర్: నాగుల జగన్నాధ్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, కథ-మాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముళ్ళగూరు వెంకటేష్ నాయుడు, నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి

Facebook Comments
2 Friends Movie Trailer Launched by C.Kalyan

About uma