Social News XYZ     

Manchu Manoj expresses deep anguish on Pranay Killing

Manchu Manoj expresses deep anguish on Pranay Killing

Hero Manchu Manoj has expressed his deep anguish on the brutal murder of Pranay who was killed in the name of honor.

“This is to all out there who think Caste and Religion is Bigger than Humanity.”

 

Caste feeling in any form, be it for caste-based movie actors (Fanism), political parties, college unions, caste, and religious organizations is brutal and messed up! Each single person who encourages caste is responsible for the horrible act that occurred with Pranay and many others like him. It’s high time that you are taught the value of life before learning anything else. An unborn child lost his/her father before even holding his hand or feeling his touch. What worse could you do to anyone to break their lives apart? All in the name of caste??? Was it even worth it?? We all have a heart, body, breathe the same air, live in the same world…why discriminate and take lives merely differentiating with the name of caste?? When would the world realize that we all are one?? Shame on all those caste lovers and supporters… Remember that you all are the ones responsible and to be blamed for this and not just the one accused of! Shut down casteism! It is a disease that needs to be prevented Open your god damn minds and behave like humans! I’m begging you all from my heart. Let’s give a better world for our children.

My heart goes out to Pranay’s wife, Amrutha and entire family! Deepest condolences.. #RIPPranay We are soo sorry…

Thank you
Manchu Manoj

ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే. దీనిపై త‌న బాధ‌ను ఓ లేఖ రూపంలో తెలిపాడు మ‌నోజ్.

"మాన‌వత్వం కంటే కులమ‌తాలు ఎక్కువ అని ఫీల్ అవుతున్న అంద‌రి కోస‌మే ఈ లేఖ రాస్తున్నాను అంటూ మొద‌లుపెట్టాడు మ‌నోజ్. కులగ‌జ్జి ఎక్క‌డున్నా త‌ప్పే.. ఈ రోజుల్లో హీరోల కులాలు.. రాజ‌కీయ పార్టీల్లోనూ కులాలే.. కాలేజ్ యూనియ‌న్స్ లో కులాలే.. మ‌తాలు.. వాటి సంఘాలు.. ఇలా అన్నింటితో ఈ రోజుల్లో స‌మాజం నిండిపోయింది. ఇంత కుల‌గ‌జ్జి ఉన్న ప్ర‌తీఒక్క‌రు ప్ర‌ణ‌య్ లాంటి ఎంతోమంది అమాయ‌కుల హత్యల‌కు వాళ్లు కూడా తెలియ‌కుండా బాధ్యులే. మ‌నం ఆలోచించుకునే స‌మ‌యం కూడా వ‌చ్చేసింది. ఓ పుట్ట‌ని పసిగుడ్డు త‌న తండ్రిని కోల్పోయింది. క‌నీసం త‌న స్ప‌ర్ష కూడా లేకుండానే ఆ బేబీ ఈ భూమ్మీద‌కు రాబోతుంది. తండ్రి ఎలా ఉంటాడో తెలియ‌కుండా చేసింది ఈ స‌మాజం. మ‌నం బ‌తుకుతున్న ప్ర‌పంచం.. స‌మాజం.. మ‌న‌కు ఉన్న గుండె.. ర‌క్తం.. గాలి అంద‌రికీ ఒక్క‌టే అయిన‌పుడు కులం పేరుతో ఇలా విడ‌దీయ‌డం.. చంపుకోవ‌డం నిజంగా మంచిదేనా..?

అస‌లు దీనికి మ‌నమంతా అర్హుల‌మేనా..? బ‌త‌కనీకుండా అలా చంపేసి ఏం నేర్చుకుంటున్నాం మ‌నం..? ఈ కులం మ‌తం కాదు మ‌నమంతా ఒక్క‌టే.. అంతా మ‌నుషులమే అని ఎప్ప‌టికి తెలుసుకుంటాం.. కులాల‌ని స‌పోర్ట్ చేసే వాళ్ల‌ను చూస్తుంటే సిగ్గుప‌డండి.. ఒక్క విష‌యం మాత్రం గుర్తుంచుకోండి.. కులం పేరుతో చంపే ప్ర‌తీ ఒక్క‌రూ ఈ నేరంలో భాగం అవుతారు. ఎవ‌రో ఒక్క‌ర్ని మాత్ర‌మే ఇందులో బ్లేమ్ చేయ‌డం క‌రెక్ట్ కాదు.. అంతా దీనికి బాధ్యులే. ఇప్ప‌టికైనా ఈ కులాన్ని మూసేయండి. ఈ కులం అనేది ఓ రోగం అని తెలుసుకుని.. క‌నీసం ఇప్ప‌టికైనా మ‌నుషుల్లా బ‌త‌కడం నేర్చుకోండి.. నా మ‌న‌సులోంచి అంద‌ర్నీ ఇది వేడుకుంటున్న మాట‌. రాబోయే త‌రానికైనా మంచి ప్ర‌పంచాన్ని ఇద్దాం. నా మ‌న‌సు ప్ర‌ణ‌య్ భార్య అమృత‌.. ఆమె కుటుంబం వైపు వెళ్తుంది. దేవుడు వాళ్ల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను.. ప్ర‌ణయ్ మ‌మ్మ‌ల్ని క్ష‌మించు.. నిన్ను కాపాడుకోలేక‌పోయినందుకు."

థ్యాంక్ యూ
మంచు మ‌నోజ్

Facebook Comments
Manchu Manoj expresses deep anguish on Pranay Killing

About uma