The release date of ‘Veera Bhoga Vasantha Rayalu’ is confirmed on October 5th. Starring Nara Rohith, Sudheer Babu, Shriya Saran and Sree Vishnu in the lead roles, the film is being directed by Indrasena. R.
Touted to be a non-linear crime drama, the first look posters of the lead cast and teaser got a tremendous response. This new age cinema is being made with a different concept and the film is nearing a completion. Along with an interesting title, the movie is also carrying a thought-provoking tagline that reads 'Cult Is Rising.'
As the makers have announced the release date, they are planning to host the audio launch event soon. Shortly the date will be finalized and will be made official. Appa Rao Bellana is producing the movie under Baba Creations banner.
Mark K Robin is composing and S Venkat is handling the cinematography.
Cast:
Nara Rohith, Sudheer Babu, Shriya Saran and Sree Vishnu
Crew:
Director: Indrasena R
Producers: Apparao Bellan
Banner: Baba Creations
Music: Mark K Robin
DoP: S Venkat, Naveen Yadav
Editor: Shashankar Mali
Art Director: Srikanth Ramisetty
PRO: VamsiShekar
అక్టోబర్ 5న వీరభోగ వసంతరాయులు విడుదల..
వీరభోగ వసంత రాయులు విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ సరన్, శ్రీవిష్ణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఆసక్తికరమైన టైటిల్ తో పాటు సినిమాలో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉండబోతుంది. కొత్త మతం పుట్టుకొస్తుంది అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన దర్శక నిర్మాతలు.. త్వరలోనే ఆడియో విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. త్వరలోనే ఈ తేదీ అఫీషియల్ గా ప్రకటించనున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పై అప్పారావ్ బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ వెంకట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నారా రోహిత్, సుధీర్ బాబు,శ్రీయ సరన్ మరియు శ్రీవిష్ణు
సాంకేతిక విభాగం:
దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారావ్ బెల్లానా
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కే రాబిన్
డిఓపి: ఎస్ వెంకట్, నవీన్ యాదవ్
ఎడిటర్: శశాంకర్ మాలి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రామిశెట్టి
పిఆర్ఓ: వంశీ శేఖర్