Naga Chaitanya to play an Army officer in his next

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చైతూ !

నాగ చైతన్య నటించిన శైలజ రెడ్డి అల్లుడు సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. చైతు తాజాగా సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది. నిన్నుకొరి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సమంత ఈ సినిమాలో చైతూకు జోడిగా నటిస్తోంది.

డివివి. దానయ్య, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా మొదటిసగం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో జరుగనుందని సమాచారం. లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ మూవీలో నాగార్జున గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. చైతు నటించిన లేటెస్ట్ సినిమా సవ్యసచి విడుదలకు సిద్దంగా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను చందు మోడేటి దర్శకత్వం వహించారు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని అధిక థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో చైతు మాస్ హీరోగా తనదైన ముద్ర వేసుకుంటాడాని ఆశిద్దాం.

Facebook Comments
Share
More

This website uses cookies.