ఆర్.ఎక్స్.100 హీరోయిన్ రూల్స్ పెట్టింది !
ఆర్.ఎక్స్.100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పాయిల్. ఈ సినిమా తరువాత కొన్ని సినిమా ఆఫర్స్ వస్తున్నా ఆమె అందుకు ఒప్పుఓవడం లేదని సమాచారం. సినిమా ఛాన్స్ వస్తే చెయ్యాలి కానీ రిజెక్ట్ చెయ్యటం ఎందుకు అనుకుంటున్నారా ???
వివరాల్లోకి వెళ్ళితే... రామ్ చరణ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యమని పాయల్ ను అడిగారట, కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదని సమాచారం. అలాగే డైరెక్టర్ తేజ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లో పాయల్ ను సెకండ్ హీరోయిన్ గా చెయ్యమని అడిగారట, కానీ ఆమె చెయ్యనని చెప్పింది.
కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తాను. సెకండ్ హీరోయిన్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చెయ్యనని రూల్స్ పెడుతోంది ఈ హీరోయిన్. ఇలా రూల్స్ పెడితే సినిమాలు ఎలా వస్తాయి ? వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఎలా మొహంమీద చేయనని చెప్పడం ఏంటని సినిమా ఇండస్ట్రీ వారు అవాక్కు అవుతున్నారు.