Yatra, that highlights momentous episodes in legendary politician YS Rajasekhar Reddy’s life, is one of the most awaited films. Good news for all YSR fans and normal movie buffs is that Yatra will be releasing on a very special day.
After releasing the film’s teaser on the occasion of YSR’s 69th birthday, the makers have now announced to release the movie on December 21st which happens to be YSR’s son and his political heir YS Jagan Mohan Reddy’s birthday.
So, YS Jagan’s coming birthday is going to be a very special one for YSR and Jagan’s fans who have been waiting eagerly to watch Yatra on big screen.
Malayalam superstar Mammootty has enacted YSR. Also starring Rao Ramesh, Posani Krishna Murali and Anasuya among others, Yatra is directed by Mahi V Raghav of Anando Brahma fame. Composer K has provided the score of the film. Shiva Meka is presenting the film, while Vijay Chilla and Shashi Devireddy are producing it on 70mm Entertainments.
Yatra posters and teaser got immense response and the promotional content has indeed raised the expectations. Mammootty's mannerisms appeared very similar to YSR's in the teaser.
Yatra story is all about the historic Padayatra of YSR that changed the course of Andhra Pradesh's politics. People across the state thronged to join the Padayatra to lend their support to YSR.
In 2003, YSR took a long walk across the state and covered about 1475 km on foot. This assured the victory of his party in the 2004 election.
Cast - Mammootty, , Jagapathi Babu, Suhasini, Anasuya, Posani Krishna Murali, Rao Ramesh , Sachin Khedekar, VinodhKumar, Jeeva, 30years Prudvi etc...
Shiva Meka Presents
Banner: 70mm Entertainments
Producers: Vijay Chilla & Shashi Devireddy
Story, Screenplay & Direction: Mahi V Raghav
Cinematographer: Sathyan Sooryan
Music: K (Krishna Kumar)
Editor: Sreekar Prasad
Lyrics: Sirivennela Seetharama Sastry
Production Design: Ramakrishna & Monica Sabbani
Choreographer: Brinda
Sound Design: Sync Cinema
VFX: Knack Studios
PRO-Eluru Sreenu
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, వై ఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే కానుకగా యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.... మడమతిప్పని నాయకుడి పాత్రలో నటిస్తున్న మమ్మట్టి గారు... ప్రజానాయకుడు వై ఎస్ ఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన యాత్ర మెదటి లుక్ కి, టీజర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. అని అన్నారు
నటీ నటులు
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని Krishna murali, సచిన్ khedekar, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి.....తదితరులు
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్
మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ )
ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని
సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్
వి ఎఫ్ ఎక్స్ - Knack Studios
పి ఆర్ ఓ - ఏలూరు శ్రీను
సమర్పణ - శివ మేక
బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్