Ravi Babu’s Adhugo Movie Trailer Launched

రవిబాబు 'అదిగో' ట్రైలర్ లాంచ్...

ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో పంది పిల్లను లీడ్ రోల్ గా చేసుకొని సబ్జెక్ట్ ను క్రియేట్ చేసిన క్రేజీ డైరెక్టర్ రవి బాబు తాజా చిత్రం 'అదిగో'. రెండున్నర సంవత్సరాల క్రితం మొదలైన ఈ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది..

ట్రైలర్ విడుదలానంతరం రవి బాబు మాట్లాడుతూ.. పంది పిల్లతో సినిమానా..? ఫైనాన్షియల్ ప్రోబ్లేమ్స్ లో ఉన్నావా..?, మానసిక పరిస్థితి బాగానే ఉందా..?, ముస్లిమ్స్ ఇలాంటి సినిమాను చూస్తారా అంటూ ఎన్నో కాన్వాగేషన్స్ మధ్య సినిమా మొదలయ్యింది. ఈ సినిమా రెండున్నర ఏళ్ళు క్రితం మొదలు అయ్యింది. 3డి పంది పిల్లను రియల్ పంది పిల్లగా కన్వెర్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది.. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ. కానీ అదిగో ఆలస్యం అవడంతో.. తనకు ఇది 5సినిమా అయ్యింది... ప్రస్తుతానికి సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో ఆడియో తో ముందుకు వస్తామని తెలిపారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ... ఇండస్ట్రీలో యానిమల్స్ తో తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. తమిళంలో కూడా విడుదలవుతోంది ఈ చిత్రం.. అక్కడి నిర్మాత అడిగాడు.. ఇన్ని జంతువులు ఉండగా ఎందుకు పంది పిల్లనే పెట్టి తీస్తున్నారు.. అయినా ఎగ్జైటిమెంట్ తో ఉన్నాను.. అని చెప్పాడు.. ఈ సినిమాలో 3డి పంది పిల్లను చూస్తున్నామా.. లేక రియల్ పంది పిల్లను చూస్తున్నామా అనేలా న్యాచురల్ లైవ్ ఇవ్వడం కోసం ట్రై చేసాము. ఈ సినిమా చేయడానికి రవికి ఉన్న ఓపికను చూసి మెచ్చుకోవాల్సిందే... ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో లవ్ ఎలెమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ అదిగో. పిల్లలకు బాగా నచ్చుతుంది.. న్యూ ఎక్స్పరిమెంట్ చేసాము.. తప్పకుండా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాము.. ఇందులో సాంగ్స్ చాలా బాగున్నాయి.. టైటిల్ సాంగ్ అయితే అద్భుతంగా వచ్చింది. సిజి వాళ్ళను ఇబ్బంది పెట్టి మరీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము.. మంచి హోప్ తో ఉన్నాము. త్వరలో ఆడియో విడుదల చేసి, సినిమాను సమ్మర్ కు విడుదల చేస్తామని చెప్పారు. పంది పిల్ల లేకుండానే ఉన్నట్టుగా క్రియేట్ చేసి సింగల్ టేకులో అవుట్ ఫుట్ తీసుకున్నాము.. చాలా బాగా బాగొచ్చింది.. అన్నారు విజువల్ ఎఫెక్ట్ చీఫ్ సూపర్ వైజర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ, భాస్కర్ భట్ల, తదితరులు పాల్గొన్నారు.

అభిషేక్ వర్మ, నాభ నటేష్, రవి బాబు, టి. ఉద్య భాస్కర్, ఆర్ కె. వీరేందర్ చౌదరి తదితరులు నటిస్తున్న అదిగో చిత్రానికి స్క్రీన్ ప్లే: సత్యానంద్, డైలాగ్స్: రవి బాబు నివాస్, లిరిక్స్: భాస్కర్ భట్ల, మేకప్: దొడ్డి శ్రీనివాస్, కొరియోగ్రాఫర్: ప్రసన్నా, యాక్షన్: కనల్ కన్నన్, విజయ్, సతీష్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: పల్లా సత్యనారాయణ, కెమెరా: సుధాకర్ రెడ్డి, మ్యూజిక్: ప్రశాంత్ విహారి, కథ-నిర్మాత-దర్శకత్వం: రవి బాబు

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%