Aswamedham movie first song launched

ధృవ్ కరుణాకర్, శివంగి హీరో హీరోయిన్స్ గా నితిన్ జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అశ్వమేథం'..స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లోని గణేశుని పాటని నేడు హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు.. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించిన ఈ పాటకి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రపీ అందించారు.. ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఐశ్వర్య యాదవ్ నిర్మించగా జయపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు..

ఈ సందర్భంగా రచయిత జగదీష్ మెట్ల మాట్లాడుతూ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి చాలా థాంక్స్.. ముందుగా స్పై థ్రిల్లర్ అనుకున్నప్పటికి తెలుగు ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. ఈ సినిమా తప్పక హిట్ కావాలని కోరుకుంటున్నాను..

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఈ పాట చేసేందుకు డైరెక్టర్ నితిన్ జి గారు ఇచ్చిన ఐన్స్పిరేషన్ అంత ఇంతా కాదు.. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సాంగ్ మేకింగ్ చాలా అద్భుతంగా చేశారు.. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు..

హీరోయిన్ శివంగి మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది.. ఈ ఆనందంలో మాటలు రావట్లేదు.. ప్రొడ్యూసర్ గారికి చాలా థాంక్స్.. నన్ను సపోర్ట్ చేసిన హీరో గారికి, డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు.. అన్నారు..

డైరెక్టర్ నితిన్ జి మాట్లాడుతూ తెలుగులో న్యూ కమ్మర్ అయిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారికి స్పెషల్ థాంక్స్..సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావాలని సినిమా ని విజయవంతం చేయాలని కోరుతున్నాను..

నిర్మాత ఐశ్వర్య నాయర్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గారు సినిమా చాలా బాగా తీశారు.. హీరో హీరోయిన్స్ ధృవ్,శివంగి చాలా బాగా యాక్ట్ చేశారు.. తెలుగు లో మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని ని ఆదరించాల్సిందిగా కోరుతున్నాను..అన్నారు..

హీరో ధృవ్ కరుణాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కి చాలా థాంక్స్ నన్ను హీరోగా ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు.. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.. తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్న ఈ సినిమా ని ఆదరించాలని కోరుతున్నాను.. ఈ సినిమాకి కష్టపడి పని చేసిన టెక్నిషియన్స్ నా ప్రత్యేక అభినందనలు అన్నారు..

తారాగణం : ధృవ్ కరుణాకర్, శివంగి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సోనియా, సుమన్, రామ జోగయ్య శాస్ట్రీ, అమిత్ తివారి

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు : నితిన్ .జి
మ్యూజిక్ : చరణ్ అర్జున్
ఎడిటర్ : తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ : జేకే మూర్తి
కొరియోగ్రపీ : గణేష్ స్వామి
సినిమాటోగ్రాఫర్ : ఎన్. జయపాల్ రెడ్డి
ఫైట్స్ : శ్రీ & రామకృష్ణ
కో డైరెక్టర్ : ఉస్మాన్
స్టోరీ స్క్రీన్ ప్లే : జగదీష్ మెట్ల
పీ. ఆర్.ఓ : వంశీ-శేఖర్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%