కర్త కర్మ క్రియ ఫస్ట్ లుక్ లాంఛ్
టాలీవుడ్ లొ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మించనున్న తెలుగు స్ట్రయిట్ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. "వీకెండ్ లవ్" ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ
సందర్భంగా
చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. "మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను "#KKK" అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటో అనే అటెన్షన్ అందరిలో మొదలైంది. "కర్త కర్మ క్రియ" అనే వైవిధ్యమైన టైటిల్ ను ఈ సినిమాకు ఎంచుకుని ఈ రోజు రివీల్ చెస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె మోషన్ పొస్టర్, టీజర్ లను విడుదల చెస్తామన్నారు.
దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కధ ఇది. మనం రోజు చూసె ,వినె కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన ఎలిమెంట్ తో ఈ కర్త కర్మ క్రియ ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ మా సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చెశాము. హీరొ హీరొయిన్ లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ గా అంతే ఉత్తమం గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాము. కర్త కర్మ క్రియ యాప్ట్ టైటిల్. టైటిల్ లొనె ఈ సినిమా అసలైన కంటెంట్ ఉంటుంది.
ప్రతి ఒక్కరికి ఈ టైటిల్ ,కంటెంట్ నచ్చుతుందని మాటీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.
వసంత్ సమీర్, సెహర్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాధ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, మహేందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ , కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.