Premaku Rain Check is all about giving a rain check to the Heroine: Abhilash Vadada (Interview)

హీరోయిన్‌కి రెయిన్‌చెక్ ఇవ్వ‌డ‌మే క‌థ - అభిలాష్‌

స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యాన‌ర్‌లో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ స‌మ‌ర్పించు చిత్రం ప్రేమ‌కు రెయిన్ చెక్‌. ఈ చిత్రానికి ఆకెళ్ళ పేరి శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర క‌థానాయ‌కుడు అభిలాష్‌తో మీడియా ముచ్చ‌టించారు...

మీ గురించి...
నా పేరు అభిలాష్‌ వాడాడా మా నేటివ్ ప్లేస్ సాలూర్‌ విజ‌య‌న‌గ‌రం ద‌గ్గ‌ర‌.  ఇది నా మొద‌టి చిత్రం. నేను ముందు  ముంబైలో యాక్టింగ్ స్కూల్ బ్యారిజాన్  అని ఉంది అక్క‌డ నేనొక ఆరు నెల‌లు యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేను చ‌దువుకున్న‌ది యు.కెలో. నాకు యాక్ట‌ర్ అవ్వాల‌ని ఎప్ప‌టినుంచో ఉండేది.  ఎక్క‌డ ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్ళాలి ఎవ‌ర్నీ ఎప్రోచ్ కావాలి అన్న విష‌యం మాత్రం నాకు తెలియ‌దు. నా చ‌దువు పూర్త‌య్యాక యాక్టింగ్ క్రాప్ట్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాల‌ని ఉండేది. దాని కోసం వెతుకుతుండ‌గా ల‌క్కీగా ఒకరోజు పిల్ల‌నువ్‌లేని జీవితం ఆడియో ఫంక్ష‌న్ చూస్తున్న‌ప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు సాయిధ‌ర‌మ్‌తేజ్‌కి చెప్పారు.  ఈ ఇనిస్టిట్యూట్ గురించి బ్యారిజాన్ అనే యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ బాగా నేర్పిస్తార‌ని ఆ విధంగా నాకు తెలిసింది. దాని త‌ర్వాత సంక్రాంతికి ఇంటికి వ‌చ్చాను . హైద‌రాబాద్‌లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయి అని తెలియ‌గానే ఆడిష‌న్స్ కి వ‌చ్చాను.

ప్రేమ‌కు రెయిన్ చెక్ అంటే...
ప్రేమ‌కు రెయిన్ చెక్ అంటే ఏదో మేము డిఫ‌రెంట్‌గా  ఉండాలి కొత్త‌గా ఉండాల‌ని ఏమీ పెట్ట‌లేదు. సినిమా చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది.  రెయిన్ చెక్ అంటే  భ‌విష్య‌త్తులో పూర్త‌య్యే ప్ర‌మాణం. ఈ చిత్రంలో ర‌మ్య అనే క్యారెక్ట‌ర్ చేసే ప్రియా త‌న‌కు రెయిన్ చెక్ ఇచ్చే అల‌వాటు ఉంటుంది. అంటే ఎవ‌రైనా ఒక‌రికి హెల్ప్ చేస్తే మ‌నం దానికి ప్ర‌తిఫ‌లం ఏదైనా చెయ్యాల‌నుకుంటాం క‌దా. కానీ ఆ అమ్మాయి ప్ర‌స్తుతం నాకు ఏమీ చెయ్య‌ద్దు భ‌విష్య‌త్తులో ఏదైనా కావ‌ల్సివ‌స్తే త‌ప్ప‌కుండా అడుగుతాను అంటుంది. రెయిన్ చెక్ అంటే అదే.

సినిమాలో మీ క్యారెక్ట‌ర్ గురించి...
ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ పేరు విక్కీ  నేను చాలా సిన్సియ‌ర్ అన్న‌ట్లు  అంద‌రికి హీరోయిన్‌ రెయిన్ చెక్ ఇస్తే నేను ఈ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తా అన్న‌ట్లు. నాకు జీవితంలో ఒక ఫిలోస‌ఫీ ఉంటుంది. నేను ఆఫీస్‌లో ఉండ‌గా ల‌వ్, రొమాన్స్ లాంటివి పెట్టుకోకూడ‌దు  ఒక వేళ పెట్టుకుంటే దానివ‌ల్ల కెరీర్ డిస్ట్ర‌బ్ అవుతది అన్న‌ది నా ఫిలాస‌ఫీ. నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ అమ్మాయితో ప‌రిచ‌యం  అవుత‌ది. నేను ఆ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తా. నాకు ప్రేమ ఉంది కానీ భ‌విష్య‌త్తులో నేను నిన్ను ప్రేమించ‌వ‌చ్చు. లేక వేరే అమ్మాయిని ప్రేమించ‌వ‌చ్చు అని అందుకే ప్రేమ‌కు రెయిన్‌చెక్‌.

యుఎస్‌లో ఎక్క‌డ‌న్న రెయిన్‌చెక్ ఉందా...
యుస్‌లో రెయిన్ చెక్ ప‌దాన్ని వాడ‌తారండి ఉదాహ‌ర‌ణ‌కు మీరు బ‌ట్ట‌ల కొట్టుకు వెళితే అక్క‌డ మీకు కావ‌ల్సిన విధంగా దొర‌క‌క‌పోతే వాళ్ళు మీకొక కార్డు ఇస్తారు రెయిన్‌చెక్  మీరు భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా ఆ కార్డును చూపించి కొనుక్కోవ‌చ్చు. అదేవిధంగా క్రికెట్ ఆడుతుంటారు స‌డెన్‌గా వ‌ర్షం ప‌డుతుంది సో అక్క‌డ రెయిన్ చెక్ ఇస్తారు. అంటే ఎప్పుడైన ఫ్యూచ‌ర్‌లో రండి వ‌చ్చి  చూడండి అని. ఎందుకంటే మా డైరెక్ట‌ర్‌గారు ఇన్వెస్ట‌ర్ బ్యాంక్ ఆయ‌న జీవిత‌మంతా ఆయ‌న కార్పెరేట్‌ లోనే ప‌నిచేశారు.

మీ లైఫ్‌లో ఎవ‌రైనా రెయిన్‌చెక్ ఇచ్చారా..
హ‌..హ‌..హ.. లేదండీ ఎవ‌రూ ఇవ్వ‌లేదు.  నేను ఎవ‌రికీ ఇవ్వ‌లేదు. నాకు ఎవ్వ‌రూ ఇవ్వ‌నలేదు.

సినిమాలో మీ జాబ్‌
ఈ సినిమాలో నేను ఎడ్వంచ‌ర్స్ స్పోర్ట్స్ కంపెనీకి వైస్‌ప్రెసిడెంట్. నేను ముందు సిమ్లాలో ఉంటాను కానీ కంపెనీ స‌రిగా ర‌న్‌కాదు బాగా లాస్‌లో ఉండ‌టం వ‌ల్ల నేను హైద‌రాబాద్ వ‌స్తాను. వ‌చ్చి నేను కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవుతాను. నా క్యారెక్ట‌ర్ విక్కీ నేను చాలా క‌ష్ట‌ప‌డ‌తాను వ‌ర్క్ ప్లేస్‌లో వ‌చ్చేస‌రికి ఓన్లీ ఫోక్స్‌డ్ వ‌ర్క్ అందుకే త‌ను జీవితంలో పెట్టుకున్న ఫిలాస‌ఫీకూడా ఆఫీస్‌లో ప్రేమ ఉంటే అది కెరియ‌ర్‌మీద ఆ రిలేష‌న్ మీద్ ఎఫెక్ట్ అవుత‌ది అని చెప్పివాడు ఆ ఫిలాస‌ఫి పెట్టుకుంటాడు. కానీపెట్టుకున్న‌కూడాను అటువంటి అంద‌మైన అమ్మాయిని కష్ట‌ప‌డి ప‌నిచేసే అమ్మాయిని క‌లిసిన త‌ర్వాత ఓన్ బ్యాటిల్ అన్న‌మాట ఆ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డాలా వ‌ద్దా, త‌న ఫిలాస‌ఫీకి ఎగెయినెస్ట్‌గా వెళ్లాలా వ‌ద్దా అన్న విధంగా దాని వ‌ల్ల వాడు ప‌డే క‌ష్టాలు ఆ క‌ష్టాల నుంచి ఎలా బ‌య‌ట ప‌డ‌తాడు అన్న‌దే సినిమా.

హీరోయిన్స్ గురించి...
మ‌రో క్యారెక్ట‌ర్ చేసేది తాన్య త‌న‌ని నేను ముంబ‌యిలో క‌లుస్తాను. వాళ్ళిద్ద‌రూ నా గురించి ఏమ‌నుగ‌కుంటారంటే ఒకేసారి ఇద్ద‌రు అమ్మాయిల‌తో ఆడుకుంటున్నాడు ఇద్ద‌రిని ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కానీ అలా కాదు సినిమా చూస్తే మీకే అర్ధ‌మ‌వుతుంది.

మీ డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గురించి...
ఈ సినిమాలో అదృష్టం ఏంటంటే మా డైరెక్ట‌రే ప్రొడ్యూస‌ర్‌. ప్రేమ‌కు రెయిన్ చెక్ అన్న‌ది అయ‌న విజ‌న్ ఆయ‌న ఎలాగైతే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకున్నారు అదే విధంగా తీశారు. ఇప్ప‌టికే నేను చాలా సార్లు చెప్పాను. గ‌తంలో  కూడా నేను చెప్పాను  నా క్యారెక్ట‌ర్ ఎడ్వెంచ‌ర్స్ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబ‌ట్టి దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కోసం ఆయ‌న డెహ్రాడూన్ తీసుకువెళ్ళారు . డెహ్రాడూన్‌లో రెండు వారాల షెడ్యూల్ అది మూడు, నాలుగు లొకేష‌న్స్‌లో తీశారు. కొత్త మొహాలంద‌రితో క‌లిసి సినిమా తియ్య‌డ‌మంటేనే గ్రేట్ అటువంటిది ఆయ‌న యూనిట్ మొత్తం 60 మెంబ‌ర్స్‌ని డెహ్రాడూన్ తీసుకువెళ్ళి. ఒక మూవీకి షెడ్యూల్ చెయ్య‌డం అన్న‌ది గ్రేట్‌. ఆయ‌నే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ కాక‌పోయుంటే ఈ పాట‌ను ఇక్క‌డ కెబిఆర్ పార్క్‌లో తీసేసేవారు.

నార్త్ స్టార్ వాళ్ళు జాయిన్ కావ‌డం...
శ‌ర‌త్‌మ‌రారుగారు జెపిగారికి మొద‌టినుంచే ప‌రిచయం ఉంది. వాళ్ళిద్ద‌రూ క‌లిసి ప‌నిచేశారు. క‌థ విని మూవీ చూసిన త‌ర్వాత శ‌ర‌త్‌మ‌రార్‌గారికి బాగా న‌చ్చింది.  ఆయ‌న ప్రెజంట్ చెయ్య‌డానికి ముందుకు వ‌చ్చారు. ఇంత కొత్త‌వాళ్ళ‌తో తీస్తున్నా అంత పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ ముందుకు రావ‌డం అంటే మా అంద‌రికీ చాలా సంతోషంగా ఉంది.  మేం ప‌డుతున్న క‌ష్టాన్ని గుర్తించార‌నిపించింది. వెరీ నైస్ ఆఫ్ షేర్ మ‌రార్‌సార్‌.

సినిమా ఎలా ఉంట‌ది...
ప్రేమ‌కు రెయిన్ చెక్ కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టెయిన‌ర్‌. అంటే మా డైరెక్ట‌ర్‌గారు సినిమా తియ్యాల‌నుకున్న‌ప్పుడు 150రూపాయ‌లు పేచేసి ఒక సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఎలాంటి ఆహ్లాదాన్ని అందించాలో అటువంటిదే ఆయ‌న చేసిన సినిమా. పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టుల న‌ట‌న అన్నీ బావుంటాయి. డెఫినెట్‌గా డిజ‌ప్పాయింట్ మాత్రం చెయ్య‌వు. ఈ చిత్రంలోని న‌టీన‌టులుకూడా ఎవ్వ‌రూ కొత్త‌గా అనిపించ‌రు.

హీరో అవ్వ‌డానికి కార‌ణం...
ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోను డ్రీమ్స్ ఉంటాయి. నాకు చిన్న‌ప్ప‌టినుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. కానీ ఇండియా తెలిసిందే ముందు ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు అయ్యాక త‌ర్వాత మ‌న రియ‌ల్ ప్రొఫెష‌న్ ఏంట‌న్న‌ది ఎన్నుకుంటాం. బ‌ట్ ల‌క్కీగా నేను యుస్‌లో చ‌దువుకోవడం వ‌ల్ల నాకు ఛాన్స్ వ‌చ్చింది. నాకు ఏది ఇష్టం అన్న‌ది.

సినిమాకి ముందు...
ఇంత‌కుముందు ఏ  ఫిల్మ్ చెయ్య‌లేదు ఇది నా మొద‌టి తెలుగు చిత్రం. ముం బ‌యిలో ఉన్న‌ప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. యాక్టింగ్ నేర్చుకున్నాను.

మొయిన్ క్యారెక్ట‌ర్స్‌
ఈ చిత్రంలో మొయిన్ క్యారెక్ట‌ర్స్ మూడు. మొత్తం ఎనిమిది క్యారెక్ట‌ర్లు. హీరో సుమ‌న్‌గారు,ర‌ఘుగారు బిగ్‌బాస్ షోలోగిరీష్‌గారు వీళ్ళంద‌రూ చేశారు.

మీకు ఇష్ట‌మైన హీరోలు...
అంటే అలా ఏమీ లేదు. అంద‌రూ ఇష్ట‌మే. రామ్‌చ‌ర‌ణ్, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, అంద‌రూ చిన్న‌ప్ప‌టినుండి  మ‌హేష్‌బాబు సినిమాలు ఎక్కువ‌గా చూసి పెరిగాను. యాజ్ ఏ యాక్ట‌ర్ అంద‌రూ ఇష్ట‌మే.  అంద‌రు హీరోలు ఇన్స్‌పిరేష‌న్‌.
ఫేవ‌రెట్ యాక్ట‌ర్‌లేరు కాని ఫేవ‌రెట్ క్యారెక్ట‌ర్స్ ఇష్టం.అవ‌కాశం ఇస్తే అన్ని క్యారెక్ట‌ర్లు చెయ్య‌డం ఇష్టం.

ఫ్యామిలీ గురించి...
అమ్మ హౌస్‌వైఫ్‌, నాన్న‌, అన్న‌య్య జాబ్ చేస్తారు వాళ్ళంద‌రూ సాలూర్‌లోనే ఉంటారు.

విజ‌య‌న‌గ‌రం స్లాంగ్ రావ‌డంలేదు...
నేను 19 ఏళ్ళ‌కే యుకె వెళ్ళిపోయాను మ‌ళ్ళీ ఈ మ‌ధ్య‌నే వ‌చ్చాను. చ‌దువు మొత్తం పూర్త‌య్యాకే నేను ముంబై వ‌చ్చి యాక్టింగ్ స్కూల్‌లో జాయిన అయ్యాను. సాలూరు అప్పుడ‌ప్పుడు వెళ‌తాను. నేను ఎంబిఎ చేశాను.

యాక్టింగ్ కాక‌పోతే...
ఒక రెండు సంవ‌త్స‌రాలు చూద్దామ‌ని న‌న్ను నేను ప్రూవ్ చేసుకోడానికి అంతే. నేను చ‌దువు కంప్లీట్ అయ్యాక ఒక ఫిట్‌నెస్‌దాంట్లో జాబ్ చేశాను.  సంక్రాంతికి నేను సాలూర్‌లో ఉండ‌బ‌ట్టి హైద‌రాబాద్‌లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని నాకు తెలిసింది రాగ‌లిగాను అదే ముంబైలో ఉండిఉంటే కుదిరేది కాదు.

ఇండ‌స్ట్రీ ఎలా ఉంది...
ఇంకా నాకు ఇక్క‌డ ఎవ‌రూ ఫ్రెండ్స్ కాలేదండి. స్టోన్ మీడియా హౌస్ వాళ్ళు మ‌మ్మ‌ల్ని చాలా బాగా చూసుకున్నారు.
మా డైరెక్ట‌ర్‌గారు, మా సినిమాటోగ్రాఫ‌ర్ ఆయ‌న 90 చిత్రాలు చేశారు కానీ ఆయ‌న మమ్మ‌ల్ని ఎప్పుడూ సెట్‌లో అర‌వ‌డం కానీ తిట్ట‌డం కానీ ఇటువంటివి ఏమీ లేవు. సో ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా స్టోన్‌మీడియా మమ్మ‌ల్ని చాలా బాగా బాగా చూసుకున్నారు.  న్యూక‌మ్మ‌ర్స్‌లాగా అస్స‌లు చూడ‌లేదు. వేరే ప్రొడ‌క్ష‌న్ హౌస్ అంటే రేపు ఎలా ఉంట‌దో నాకు ఇంకా తెలియ‌దుగా. బ‌ట్ వీళ్ళ‌యితే చాలా బాగా చూసుకున్నారు. ఒక యాక్ట‌ర్‌గా చాలా నేర్చుకున్నాను కూడా. సినిమా తియ్య‌డం చాలా ఈజీ కానీ జ‌నాల్లోకి తీసుకెళ్ళ‌డం మార్కెటింగ్ ఇలాంటి విష‌యాలు చాలా తెలిసొచ్చాయి.

ప్లానింగ్ ఏదైనా ఉందా...
అలా ఏమీ లేదండి. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. మ‌న‌తో పాటు ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా వ‌స్తున్నాయి. ఎవ్వ‌రూ  ఎవ‌రికీ తెలియ‌దు. క‌నీసం ఆడియ‌న్స్‌కి సెలెక్ట్ చేసుకోడానికి ఆప్ష‌న్ అనేది ఉంట‌ది. అదే పెద్ద సినిమాతో రిలీజ్ అయితే ఆ ఇన్‌టెన్ష‌న్ మొత్తం పెద్ద సినిమాకే ఉంటది. ప్లానింగ్ అనేది మ‌నం చెయ్య‌లేం డెఫినెట్‌గా  అంటే ముందే ఈ సినిమా ఒక రెండు వారాల ముందు విడుద‌ల చేద్దాం అనుకున్నాం. కానీ సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కాబోతుంది. మ‌న చేతిలో ఏమీ ఉండ‌దు క‌ష్ట‌ప‌డితేనే ఫ‌లితం.

ఎలాంటి క్యారెక్ట‌ర్స్‌...
నేను యాక్ట‌ర్‌గా రావాలి అంతే కాని నేను కొత్త‌వాడ్ని ఇప్పుడే నాకు ఆప్ష‌న్స్ ఏమీ ఉండ‌వు అండీ.  వాళ్ళు న‌న్ను సెలెక్ట్ చేసుకుని ఎలాంటి క్యారెక్ట‌ర్‌లో న‌న్ను అనుకున్నారో  దానికి న్యాయం చెయ్య‌డం అంతే.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%