Chandrababu Naidu’s Biopic Chandrodayam Movie First Look Released

బాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది.  తెలుగులొ ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో  మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్ , చంద్రబాబు నాయుడు ,వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ల బయోపిక్ లు సైతం చిత్రీకరణ దశలొ ఉన్నాయి. ఇందులొ చంద్రబాబు నాయుడు బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చెశారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారు ఓ లివింగ్ లెజెండ్. దేశ చరిత్రలొనె ఆయనొక అరుదైన , ఆదర్శవంతమైన నాయకుడు. ఓ సామన్య కుటుంబంలో పుట్టి అగ్ర స్దానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియచెప్పాలనే సంకల్పంతో బాబు గారి బయోపిక్ ను తెరమీదకు తీసుకువస్తున్నామ ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తిచేశాము. వినోద్ నువ్వుల చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. బాస్కర్ ఎన్టీఆర్ గా కన్పిస్తారు. చంద్రబాబు నాయుడు చిన్నతనం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ బయోపిక్ లో చూపిస్తామన్నారు.

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చెసి ఈ  సెప్టెంబర్ 1కి 23 సం. లవుతోంది.ఈ సందర్బంగా మా చిత్ర ఫస్ట్ లుక్  పొస్టర్ ను విడుదల చెస్తున్నాము.ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లొ అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్ ను  మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. త్వరలొనె సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు

వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక , భాస్కర్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశేట్టి, నిర్మాత : జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%