Producer Vijay Varma Pakalapati received MAA silver jubilee memento on behalf his birthday. In the occasion, Vijay Varma Pakalapati says "Tq so much to Movie Artists Association. As this is the silver jubilee year for MAA...MAA is presenting a memento to its Members on their Birth Date. MAA president Sivaji Raja annayya personally invited me to receive a memento and glad to receive it from the hands of Shivaji Raja annayya, Benergy Annayya, Sriram garu and Nagi Needu Garu. It's always a pleasure to receive any kind of honour from the prestigious organisation MAA"
'మా' సిల్వర్ జూబ్లీ మెమెంటో అందుకున్న నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌లోని సభ్యుల పుట్టినరోజున వారిని ఆహ్వానించి సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి పుట్టినరోజు సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇటీవల సిల్వర్‌జూబ్లీ మెమెంటోను అందజేసింది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ ''మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు నా కృతజ్ఞతలు. సిల్వర్‌జూబ్లీ సందర్భంగా సభ్యుల పుట్టినరోజున మెమెంటో అందిస్తున్నారు. 'మా' ప్రెసిడెంట్ శివాజీరాజాగారు మెమెంటో తీసుకోవాల్సింది నన్ను పర్సనల్‌గా ఆహ్వానించారు. ఈ మెమెంటోను శివాజీరాజా అన్నయ్య, బెనర్జీ అన్నయ్య, శ్రీరామ్‌గారు, నాగినీడుగారి చేతుల మీదుగా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను'' అన్నారు.