Diksuchi movie Hindi rights sold for a fancy price

ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయిన "దిక్సూచి" హిందీ రైట్స్

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, నుంచి "జయం" వరకు  చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసెశాడు. అది కూడా తెలుగు మరియు తమిళం, మళయాళ బాషల్లో..  నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకొబొతొన్న ఆ కుర్రాడీ పేరు  దిలీప్. దిలీప్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలొ ఎస్.ఆర్.ఎస్. అసొసియేట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై తెరకెక్కతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని , నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు-దర్శకుడు దిలీప్ మాట్లాడుతూ.. "ఈ తరహా కథాంశంతో ఇప్పటివరకూ తెలుగులో సినిమా రాలేదు. మూడు జోనర్స్ మిక్సింగ్ గా రూపొందిన సినిమా ఇది. 1970 నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా ఉండబోతోంది. కేవలం పోస్టర్ చూసి హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ భారీ రేట్ కి కొనుక్కోవడం విశేషం. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అన్నారు.

చాందిని, సుమన్, డాక్టర్ రజిత సాగర్, బిత్తిరి సత్తి, ఛత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, మల్లాది భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రామరాజు, వి.ఎఫ్.ఎక్స్: కొత్తపల్లి ఆది, కో-డైరెక్టర్: ఎస్.నందకిషోర్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి, పాటలు: శ్రీరామ్ తపస్వీ, ఎడిటింగ్: గ్యారీ బీ.హెచ్, కళ: పునురి ఎ.ఆనంద్, సంగీతం: పద్మనావ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం: జయకృష్ణ కూనపరెడ్డి, నిర్మాతలు: శైలజా సముద్రాల-నరసింహరాజు రాచూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దిలీప్ కుమార్ సల్వాడి.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%