Vishapuram is the first Zombie movie in Telugu

తెలుగులో వస్తున్న మొట్టమొదటి జాంబీ చిత్రం " విషపురం "

హార్ట్ బ్రేకర్ క్రియేషన్స్ ప‌తాకంపై ష‌ఫీ ముఖ్య పాత్రలో ఆయుష్ రామ్, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా జాంబి జాన‌ర్ లో తెలుగులో వసున్న మొట్టమొదటి చిత్రం "విషపురం". శ్రీనివాస్ సందిరి ద‌ర్శ‌క‌త్వంలో పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధ‌వ‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 14న రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ సందిరి మాట్లాడుతూ ... స్నేహితుడి ప్రేమ కోసం వెళ్లిన నలుగురు కుర్రాళ్లు అనుకోకుండా జాంబీల చేతిలో చిక్కుకోవడం.. చివరకు వాటి నుండీ ప్రాణాలు కాపాడుకున్నారా లేదా అనే విషయం ఆద్యంతం ప్రేక్షకుల థ్రిల్ కు గురి చేస్తుంది, ఒక గ్రామం మొత్తం జాంబీలుగా మారితే ఎలా ఉంటుందో తెరమీద చూడాల్సిందే.ష‌ఫీ పాత్ర సినిమాకు కీ రోల్ గా ఉంటుందన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ... తెలుగులో ఇలాంటి కథలు ఎవరూ ఇంత వరకు చేయలేదని తెలిసి ముందు భయపడ్డ కథని, డైరెక్టర్ ని నమ్మి ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా చేసాం టీమ్ అంతా కూడా సినిమా కోసం ఎంతో శ్ర‌మించారు. కెమెరా వ‌ర్క్, నేప‌థ్య సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం“ అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో యాదవ్ రెడ్డి, మల్లేష్ యాద‌వ్‌, దేవా, రాము, త‌దిత‌రులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతంః వెంక‌ట్, కెమెరాః కిష‌న్ టి,సంగీతంః రోహిత్ జె, కో-ప్రొడ్యూస‌ర్స్ః ర‌మేష్ బండి, బి.వెంక‌టేశం; నిర్మాత‌లుః పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధ‌వ‌రెడ్డి, క‌థ‌- స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వంః శ్రీనివాస్ సందిరి

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%