4 కోట్లులోపు నిర్మించే చిన్న సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది పెద్ద హామీ - ఏ పి ఎస్ టి వి ఎఫ్ డి సి చైర్మన్ అంబికా కృష్ణ
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తరువాత తొలి సారిగా తెలుగు సినీ పరిశ్రమకు, ముఖ్యంగా చిన్న సినిమా మనుగడ కోసం, ఆంధ్ర రాష్ట్రములో కూడా తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయ నేత, ఎ.పి.యస్.యఫ్.డి.సి ఛైౖర్మన్ అంబికా కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం అమరావతిలో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిన సందర్భంగా పాత్రికేయులకు తెలిపిన వివరాలు.
ఎ.పి.యస్.యఫ్.డి.సి ఛైర్మన్‌గా మీకు అవకాశం ఎలా వచ్చింది?
- ఒక వ్యాపారవేత్తగా, సినీ పరిశ్రమలోని నిర్మాతగా, ప్రదర్శనదారుడిగా, పంపిణీిదారుడిగా నాకున్న అనుభవం... తెలుగు సినీ పరిశ్రమలోని సాధక బాధకాలు తెలిసిన వ్యక్తినని నన్ను గుర్తించి చంద్రబాబునాయుడుగారు నాకు ఈ బాధ్యత అప్పగించారు. అందుకు ముందుగా ఆయనకి క తజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మీరు ఛైర్మన్‌గా బాధ్యత తీసుకున్న తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమ అభివ ద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు చెప్పండి?
- ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ గురించి.. చిన్న నిర్మాతలు ఆర్ధికపరంగా ఎలాంటి సమష్యలు ఎదురుకుంటున్నారో సిఎం గారికి చెప్పాను అయన వెంటనే స్పందించారు. దానికి ఏం చెయ్యాలో నివేదిక రెడీ చేయమన్నారు. నా ఆధ్వర్యం లో ఎఫ్.డి.సి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌తో కలిసి ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వులో వున్న అంశాలను సి.ఎంగారికి వినిపిస్తే.. 'కొత్త రాష్ట్రము ఆర్థిక పరంగా లోటు వున్నా సరే తెలుగు సినీ పరిశ్రమ బాగుకోసం మీరు తీస్కున్న నిర్ణయాలు సరైనవే' అని మమ్ము ప్రోత్సహిం చారు. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 116కి ఆమోదం తెలిపారు.
ఈ రోజు విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమిటి?
- తెలుగు సినిమా బడ్జెట్ 4 కోట్లు లోపు నిర్మించే చిత్రాలకు ఏ.పి టాక్స్ లేదు. అంటే జి.యస్.టిలో ఏ.పి ప్రభుత్వానికి వచ్చిన పన్ను తిరిగి నిర్మాతకు ఇవ్వబడుతుంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించే సినిమాలకు ప్రభుత్వ లొకేషన్స్ అన్ని ఉచితంగా సింగిల్ విండో ద్వారా పర్మిషన్. కాకపోతే అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కట్టవలసి ఉంటుంది. ఎలాంటి డామేజ్ చేయకుండా సవ్యంగా షూటింగ్ జరుపుకుంటే ఆ డిపాజిట్ తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. ఫిలిం డెవలప్‌మెంట్ పర్యవేక్షణలో ఏడాదికి 15 ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు సబ్సిడీ. ఇవి ముఖ్య అంశాలు.
మీరు 4 కోట్లలోపు సినిమా అంటున్నారు. ఉదాహరణకు 7, 8 కోట్లతో తీసి 4 కోట్లలో తీసాము అని నిర్మాత చూపిస్తే?
- ఆంధ్ర రాష్ట్రము లో నిర్మాణ కార్యాలయం ఉండి, సినిమా స్టార్ట్‌కి ముందే నిర్మాత తన బడ్జెట్ స్టేట్మెంట్‌ను, సంస్థ వివరాలు అన్ని ఎఫ్.డి.సిలో నమోదు చేస్కోవాలి. టోటల్ షూటింగ్ పూర్తి అయిన తరువాత వాళ్ళు ఇచ్చే బిల్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పరిశీలించి, టాక్స్ రీ ఎంబ్రెస్‌మెంట్ ఇస్తాము. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ రాయితీలు వర్తిస్తాయి.
నేడు హీరో, డైరెక్టర్ల రెమ్యూనరేషన్సే కోట్లలో వుంటున్నాయి. ఇప్పుడు మీరనే నాలుగు కోట్లలో సినిమాలు నిర్మించడం సాధ్యమేనా?
- మంచి ప్రశ్న... ఇటీవల విడుదల అయిన చిన్న సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఆ సినిమాల టోటల్ బడ్జెట్ పబ్లిసిటీతో కలిపి 4 కోట్లలోపే తీసినవి. మేము పాస్ చేసిన జి.ఓ లో నటీనటుల పారితో షికం మినహాహీంచి, కేవలం సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు మాత్రమే 4 కోట్లు లోపు ఉండాలి. అదీ షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరపాలి.
మరి పోస్ట్ ప్రొడక్షన్ సంగతి?
- సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కి ఇక్కడ ఇంకా మౌళిక సదుపా యాలు లేవని మాకు తెలుసు? ప్రస్తుతం ఎడిటింగ్ అనేది ప్రొడక్షన్ ఆఫీస్‌లలో కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా రికార్డింగ్, రీ-రికార్డింగ్, మరియు డబ్బింగ్, క్వాలిటీపరంగా అవసరమయ్యే సి.జి వర్క్స్ కంపెనీలు లాంటివి కొన్నింటికి హైదరాబాద్‌లో చేసుకోడానికి వీలు కల్పించాం. సినిమా నిర్మాణానికి ఇక్కడ ఏమైతే సదుపాయాలు లేవో వాటికి మినహాయింపు ఉంటుంది.
చిన్న సినిమాలను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు? కానీ కొంతమంది చేతిలో వున్న థియేటర్స్ చిన్న సినిమాలకి ఇవ్వట్లేదు కదా? ఆ సమస్యను మీరెలా పరిష్కరిస్తారు?
- చిన్న సినిమాలకే కాదు.. పెద్ద సినిమాలకి కూడా థియేటర్స్ రన్ సమస్య వుంది. సినిమా థియేటర్లు కొందరి చేతుల్లో వున్న మాట వాస్తవమే, కానీ వారికీ ఇప్పుడున్న పరి స్థితుల్లో వస్తున్న లాభం పెద్దగా ఏమీ లేదు. రోజుకి 5 ఆటలు వేయటం వలన పెద్ద స్టార్స్ మూవీ తొలి రోజు వసూళ్లు పర్వాలేదు కానీ.. ఆ తర్వాత ఒక్కో సందర్భంలో షోస్ రద్దు చేయడం కూడా జరుగుతోంది. రోజు ప్రదర్శించే నాలుగు ఆటలలో ఒక్క షో తప్పనిసరిగా చిన్న సినిమా వేసేలా మీరు (జర్నలిస్ట్‌లు) ఇచ్చిన సూచన మేరకు పరిశీలిస్తాం.
చిన్న సినిమాలకి 10 లక్షలు సబ్సీడి ఇస్తాం అన్నారు..!
అవి ఎలాంటి చిత్రాలు అయ్యుండాలి?
- మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన కథాంశాలతో తీసే చిన్న సినిమాలకి 10 లక్షలు సబ్సీడి ఇస్తాం. అయితే ఏడాదికి 15 సినిమాలకి మాత్రమే ఈ ప్రోత్సాహకాలు వుంటాయి. దీనికి ఒక కమిటీ వుంటుంది.
మరి సెన్సార్ పరిస్థితి?
-ఇక్కడ కూడా ప్రాంతీయ సెన్సార్ బోర్డు కావాలని ప్రభుత్వం తరపున సెంట్రల్ సెన్సార్ బోర్డు వారిని అడిగాము. అది వచ్చేవరకు హైదరాబాద్ సెన్సార్ ఆఫీస్ లోనే సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడే స్థిరపడాలని ఈ జీఓని తెచ్చారా?
- తెలుగు సినీ పరిశ్రమ ఆల్‌రెడీ మద్రాస్ (చెన్నై) నుండి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యి స్థిరపడింది. ఈ జీఓ మేం పాస్ చేయడానికి రీజన్ చిన్న సినిమాల మనుగడ కోసం. తెలుగు సినీ పరిశ్రమ అక్కడా, ఇక్కడా కూడా మరింత అభివృద్ధి చెందాలన్నదే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి సదుద్దేశం. మరో విషయం ఇప్పుడున్న స్టార్స్ సినిమాలు కూడా ఒక వారం పది రోజులపాటు ఆంధ్రరాష్ట్రములో షూటింగ్ జరిగేలా ప్లాన్ చేయమని పెద్ద స్టార్స్ ని వక్తిగతంగా కలిసి అడిగాను వాళ్ళు ఆమోదం తెలిపారు.
ఇక్కడ స్థిరపడాలంటే సినీ పరిశ్రమకు మీరిచ్చే అదనపు సదుపాయాలేంటి?
- సినిమా నిర్మించాలంటే ఈ రోజుల్లో చాలా సులువు అన్ని విభాగాల్లో డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడున్న యువత డిజిటల్ కెమెరాలతో చిన్న చిన్న గ్రామాల్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నారు యు ట్యూబ్ లో పెడుతున్నారు. అవి షార్ట్ ఫిలింలు సినిమా వీరు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి విశాఖ, భీమిలిరోడ్డు మార్గంలో రామానాయుడు స్టూడియో సమీపంలో గతంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయిం చిన 316 ఎకరాల స్థలంలో స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది. ఇందుకు ఎకరం రూ. 50 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. ఇప్ప టికే బాలక ష్ణగారు, ఏవీఏం స్టూడియో అధినేతలు నిర్మాణానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ ఒక రేటు ఫిక్స్ చేసిన తర్వాత కేటాయిస్తాం.
సీఎం చంద్రబాబుగారు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
అమరావతిలో యన్.టి.ఆర్. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ పెడతామని అన్నారు కదా! ఎంతవరకు వచ్చింది?
- పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాలకు శిక్షణ ఇవ్వాలన్నదే యన్.టి.ఆర్. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆశయం. ప్రభుత్వం ఆల్‌రెడీ 20 ఎకరాలు యన్.టి.ఆర్. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి కేటాయించింది. ఆ మహానుభావుడు పేరు మీద స్థాపించే ఇన్‌స్టిట్యూట్ సాదాసీదాగా, ఏదో మొక్కుబడిగా కాకుండా పరిపూర్ణంగా అన్ని రకాల గ్రేట్ టెక్నీషియన్స్‌ని సంప్రదించి ఇండియాలో ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాం.
సినిమా, టీవి నంది అవార్డులను ప్రకటించారు కదా? వాటి ప్రదానోత్సవం ఎప్పుడు?
- మేం ప్రకటించిన 5 సంవత్సరాల సినిమా, టీవి నంది అవార్డుల ప్రదానోత్సవం అమరావతిలోనే వుంటుంది. నవం బర్ లేదా డిసెంబర్‌లో ఈ కార్యక్రమం అత్యంత గ్రాండ్‌గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే నాటక రంగానికి చెందిన అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్‌లో ఏలూరులో జరుగుతుంది. తెలుగు సినీ పరిశ్రమకు అన్నిరకాలుగా, అన్ని వేళలా అండదండగా నిలవాలనేదే మా ఉద్దేశ్యం, మా ముఖ్యమంత్రిగారి ఉద్దేశ్యం.
This website uses cookies.