Kona Venkat to present Ee Maya Peremito movie

ఈ మాయ పేరేమిటో  చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది  - కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై  సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ఈ మాయ పేరేమిటో. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌.రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. ఈ సినిమాకు కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా సోమవారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ - సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు మంచి సినిమా చేశార‌ని అప్రిషియేట్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఆగ‌స్ట్ 24న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం కానీ.. కొన్ని కార‌ణాల‌తో సినిమా విడుద‌ల‌ను వెన‌క్కి నెట్టాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తాం అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన‌వెంకట్ మాట్లాడుతూ - మూడేళ్ల ముందు రాహుల్ జిమ్నాస్టిక్స్ వీడియో చూసి స్ట‌న్ అయిపోయాను. నాతో మాట్లాడిన త‌ర్వాత విజ‌య్ మాస్ట‌ర్  రాహుల్‌ను స‌త్యానంద్ మాస్ట‌ర్‌గారి ద‌గ్గ‌ర‌కు ట్ర‌యినింగ్‌కు పంపారు. మూడు ద‌శాబ్దాలు పైగా సినిమాల్లో ఫైట్ మాస్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్న విజ‌య్ మాస్ట‌ర్‌.. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ గ‌ర్వంగా చెప్పుకునే గొప్ప టెక్నీషియ‌న్‌. ఆయ‌న కొడుకు సినిమాకు నేను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆనందంగా ఉంది. రాహుల్ ,కావ్యా థాప‌ర్ మంచి ఈజ్‌తో న‌టించారు. రాహుల్ మంచి హీరోగా ఎదుగుతాడు. త‌ను న‌టించే సినిమాను నేను స‌మ‌ర్పించ‌డం గ‌ర్వంగా ఉంది. ప్ర‌తి మ‌నిషి జీవితంలో ప్రేమ క‌థ ఉంటుంది. ప్రేమ క‌థ‌ల‌న్నీ స‌క్సెస్ కావు. చాలా వ‌ర‌కు ప్రేమ‌లు ఫెయిల్ అయినా.. జ్ఞాప‌కాలుగా మిగిలిపోతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన నిన్నుకోరి యూత్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. అలాంటి కనెక్టింగ్ ల‌వ్ స్టోరితో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌థాబ‌లం ఉన్న సినిమాలు కొత్త‌వైనా స‌రే! తెలుగు ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రిస్తున్నారు. అలాంటి బ‌ల‌మైన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది అన్నారు.

హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ - కొన్ని రోజుల ముందు రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్‌లో సినిమా చూసిన కోన‌గారు చూస్తున్న‌ప్పుడు ఆయ‌న ఏమంటారోన‌ని చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. ఆయ‌న చాలా బాగా చేశావు. మూడు నాలుగు సినిమాలు చేసిన ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా చేశావ‌ని అన‌గానే హ్యాపీగా అనిపించింది. అలాగే మా సినిమా ఆడియో విడుద‌ల చేసిన తార‌క్ అన్న‌కు.. అండ‌గా నిల‌బ‌డుతున్న ఆయ‌న అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత దివ్యా విజ‌య్‌, హీరోయిన్ కావ్యా థాప‌ర్ పాల్గొన్నారు.

ఈరోజు హీరోయిన్ కావ్యా థాప‌ర్ పుట్టిన‌రోజు కావ‌డంతో.. పాత్రికేయుల స‌మ‌క్షంలో కావ్యాథాప‌ర్ కేక్ క‌ట్ చేశారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%