విడుదల కు సిద్దమైన "వస్తున్నా" విత్ పవర్
A.V.M. ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రముఖ దర్శకుడు V. సాగర్ గారి దర్శకత్వ పరివేక్షణలో బాబు హీరోగా నటిస్తూ ..నిర్మిస్తున్న చిత్రం "వస్తున్నా" విత్ పవర్ అనేది టాగ్ లైన్. బేబీ మేరీ విజయ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాని కి శివప్రసాద్ రెడ్డి దర్శకుడు. పవర్ఫుల్ పోలీస్ కధ తో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నేటి సమాజంలో రాజకీయ నాయకుడు. సంఘవిద్రోహశక్తులు కలిసి చేస్తున్న అరాచకాలపై ఒక భాద్యతగల పోలీస్ అధికారి చేసిన పోరాటాన్ని వినూత్న0 గా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు.
ఈ చిత్రం లో చంద్రబోస్ రాసిన పాటలకు నూతన సంగీత దర్శకుడు చిన్నికృష్ణ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. ఈ నెలాఖరు కు ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రంలో హీరో "బాబు " కి జోడిగా మైరా సింగ్. మహిజ హీరోయిన్లు గా నటించగా.. సీనియర్ నటులు సుమన్. భానుచందర్. సీత . కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి కెమెరా : M.మురళీ కృష్ణ. కథ. మాటలు: G.విజయా రెడ్డి. కో ప్రొడ్యూసర్: V.M.M. ప్రవీణ్. స్క్రీన్ ప్లే. దర్శకత్వం:G.శివప్రసాద్ రెడ్డి. నిర్మాత: బాబు