స్టార్ డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా ‘శుభలేఖ+లు’ రెండో వీడియో సాంగ్
పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిల్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘‘శుభలేఖ+లు’’. ఈ మూవీ టైటిల్ నుంచి.. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘శృంగారాలహరీ శృతజన శుభకరీ సౌందర్యలహరీ’ అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగే ఈ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు కెఎమ్ రాధాకృష్ణ సంగీతం ఓ హైలెట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియో సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాటిని ఈ పాట రెట్టింపు చేసింది.
చాలా ఇన్నోవేటివ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘శుభలేఖ+లు’’చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది.
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా. ఇర్ఫాన్, తిరువీర్, సింధు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కథ- మాటలు : జనార్ధన్- విస్సు, సంగీతం : కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ : మురళీమోహన్ రెడ్డి, ఎడిటర్ : మధు, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. సూర్యనారాయణ, నిర్మాతలు : సి విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్ధన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శరత్ నర్వాడే.