The film ‘Mahanati’ has bagged the Indian Film Festival of Melbourne (IFFM) Equality in Cinema award. This is the first award, the film has received after its release and blockbuster success.
The team of ‘Mahanati’ i.e, director Nag Ashwin, actress Keerthy Suresh, producers Swapna Dutt and Priyanka Dutt have attended the IFFM award ceremony and received the award.
Speaking after winning the award, producer Swapna Dutt said, “It’s an honor to be here and win an award for such an outstanding film. Not just in the domestic market, ‘Mahanati’ performed really well in the overseas as well. The box office numbers say so and we are super proud of the product we made.”
The team of ‘Mahanati’ also took part in an interactive session that was hosted by popular Bollywood film critic Rajeev Masand and talked extensively about the film and its making.
Actress Keerthy Suresh who essayed the titular role of Savitri in ‘Mahanati’ was also nominated in the Best Actress category.
IFFM అవార్డ్ గెలుచుకున్న మహానటి..
తెలుగులో సంచలన విజయం సాధించిన మహానటి ఇప్పుడు విదేశాల్లోనూ సత్తా చూపిస్తుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ కు ఎంపికైన మహానటి.. ఈక్వెలిటి ఇన్ సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. మహానటి టీం.. దర్శకుడు నాగ్ అశ్విన్.. హీరోయిన్ కీర్తిసురేష్.. నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ఆ వేడుకకు హాజరై అవార్డును అందుకున్నారు.
అవార్డ్ స్వీకరించిన తర్వాత నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. ఓ అద్భుతమైన చిత్రం నిర్మించి ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. మహానటి కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ అద్భుతమైన విజయం సాధించింది. బాక్సాఫీస్ నెంబర్స్ దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ సినిమా నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు.
అవార్డ్ వేడుక తర్వాత ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మహానటి యూనిట్. సినిమాకు సంబంధించిన మేకింగ్ విశేషాలతో పాటు ఇంకా చాలా విషయాలు మీడియాతో పంచుకున్నారు. అంతేకాదు.. మహానటిలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తిసురేష్ ఉత్తమ నటి కేటగిరీలో నామినేట్ అయ్యారు.