Kedi No 1 movie first look launched

`కేడీ నెం-1` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌!!

తుపాకి, ఉరిమి, పులి, చిత్రాల‌ను తెలుగులోకి అనువదించి త‌న అభిరుచి చాటుకున్న  డి.గిరీష్ బాబు  తాజాగా స్వామి-2 చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందిస్తున్నారు.  ఒక వైపు డ‌బ్బింగ్ చిత్రాలు రిలీజ్ చేస్తూనే...  మ‌రోవైపు ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా కేడీ నెం-1 అనే స్ట్ర‌యిట్ సినిమాను నిర్మిస్తున్నారు.   ఖుషీ గ‌డ్వీ, గుర్లిన్ చోప్రా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  శ్రీ వీర‌భ‌ద్ర స్వామి ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై జానీ ద‌ర్శ‌క‌త్వంలో డి.గిరీష్ బాబు నిర్మిస్తోన్న కేడీ నెం1`.  చిత్రం ఫ‌స్ట్ లుక్  ఈరోజు ఫిలించాంబ‌ర్ లో ప్రముఖ నిర్మాత కె.వి.వి స‌త్య‌నారాయ‌ణ చేతుల  మీదుగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా కె.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ...ఫైనాన్సియ‌ర్ గిరీష్ బాబు నిర్మాత‌గా మారి తొలిసారిగా  కేడీ నెం-1 చిత్రం నిర్మిస్తున్నాడు.  నేను నిర్మించిన ఎన్నో చిత్రాల‌కు టెక్నీషియ‌న్ గా ప‌ని చేసిన జానీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.  `శంభో శంక‌ర` తొలి  చిత్రంతో నే బ్ర‌హ్మాండ‌మైన ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుని,  హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ ఈ చిత్రంలో  మాస్ హీరోగా  న‌టిస్తూ త‌న‌లోని మ‌రో కోణం చూపించ‌బోతున్నాడు. ఫ‌స్ట్ లుక్ చాలా బావుంది.  టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి అని తెలిపారు.

నిర్మాత డి.గిరీష్ బాబు మాట్లాడుతూ...`` నిర్మాత‌గా ఇది నా ఫ‌స్ట్ సినిమా. తొలి షెడ్యూల్ పూర్త‌యింది.  ఇంకా ప‌దిహేను రోజుల షూటింగ్ బేల‌న్స్ ఉంది.  పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం ఇది.   త్వ‌ర‌లో షూటింగ్  పూర్తి చేసి అక్టోబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. కేవి.వి. స‌త్య‌నారాయ‌ణ‌గారి పూర్తి స‌హ‌కారంతో  ఈ సినిమా నిర్మించ‌గ‌లుగుతున్నా` అని చెప్పారు.

హీరో ష‌కల‌క శంక‌ర్ మాట్లాడుతూ...క‌థ న‌చ్చి సినిమా చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు జానీ గారు ఈ సినిమాలో న‌న్ను చాలా కొత్త‌గా చూపిస్తున్నారు.  నెల రోజులుగా నాతో వ‌ర్క్ వుట్స్ చేయిస్తున్నారు.  త‌న ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా చేయ‌డం చాలా హ్యాపీ గా ఉంద‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ...కే.వి.వి. స‌త్యనారాయ‌ణ‌గారు, వార‌బ్బాయి వేణుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ గా ఇది తొలి సినిమా. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా ధ‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా శంక‌ర్ చాలా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు అని అన్నారు.

ముఖుల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్‌, తాగు బోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ టీమ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌;  కెమెరాః ముజీర్‌;  కొరియోగ్రాఫ‌ర్ః శివ శంక‌ర్ మాస్ట‌ర్‌;  ఫైట్స్ః కృష్ణం రాజు; ప‌్రొడ్యూస‌ర్ః డి.గిరీష్ బాబు; స‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వంః జాని.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%