Tanishq reddy who made his mark as a Debut Actor in "Aa Aiduguru" coming up with a new age mass masala love story Titled "Sakala Kala Vallabhudu". This Lovely Entertainer directed by debutant G.Shiva. Anil Guntreddy, Trinadh Dadala, Kishore & Srikanth Combinely Producing this Youthful film on Simha Films Banner. Shooting completed recently and the post-production work is getting completed in a fast phase.
Makers are planning to release the First Look Poster & Teaser Very soon. "Guntur Talkies & PSV Garuda Vega" Fame Dharmendhra Kakarala is the Editor for this Romantic Entertainer.
Tanishq Reddy is pretty confident about this film and he wants to showcase his dancing & fighting skills through "Sakala Kala Vallabhudu". Meghla is the female lead while Many Seasoned Artists playing key roles.
Ajay Patnaik who is Brother of Popular Music Director Turned Hero R.P.Patnaik is Composing the Music.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో "సకలకళా వల్లభుడు"
"ఆ అయిదుగురు" చిత్రంతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు తనిష్క్ రెడ్డి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "సకలకళా వల్లభుడు". సింహా ఫిలిమ్స్ పతాకంపై అనిల్ గుంట్రెడ్డి-త్రినాధ్ డడాల-కిషోర్-శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి జి.శివ దర్శకత్వం వహిస్తుండగా.. తనిష్క్ రెడ్డి సరసన మేఘ్ల కథానాయికగా నటిస్తోంది.
టాకీపార్ట్ తోపాటు పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసి.. సెప్టెంబర్ నెలాఖరుకల్లా చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
మాస్ మసాలా ఎలిమెంట్స్ తోపాటు యూత్ ను ఎట్రాక్ట్ చేసే అన్నీ అంశాలతో ఒక పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన "సకలకళా వల్లభుడు" ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుందన్న నమ్మకం తమకు ఉందని దర్శకుడు జి.శివ చెబుతుండగా.. హీరోగా తనకు మంచి స్టార్ డమ్ తీసుకొచ్చే సినిమాగా "సకలకళా వల్లభుడు" నిలుస్తుందని కథానాయకుడు తనిష్క్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశాడు.
"గుంటూరు టాకీస్, పి.ఎస్.వి గరుడ వేగ" ఫేమ్ ధర్మేంధ్ర కాకరాల ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు.