Social News XYZ     

“Ganda Bherunda” Movie Ready for Release

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ'

"Ganda Bherunda" Movie Ready for Releaseవిజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తోపాటు సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. 'గండ భేరుండ పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్నిఅత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ 'గండభేరుండ' చిత్రాన్నికాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. సెన్సార్ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

 

రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీ సాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!

Facebook Comments
"Ganda Bherunda" Movie Ready for Release

About uma