Social News XYZ     

Bluff Master movie title logo poster launched by Puri Jagannath

పూరి జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ 

Bluff Master movie title logo poster launched by Puri Jagannath

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి.  అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం చ‌తురంగ వేట్టై. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌ పేరుతో రీమేక్ అవుతోంది.  శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు.  జ్యోతిల‌క్ష్మి, ఘాజి చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు . ఎక్క‌డికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన  నందితా శ్వేత ఇందులో  నాయిక‌. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ని హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ గోపీ గ‌ణేశ్ ద‌ర్శ‌కునిగా నా కిష్టం. అత‌నితో నేనొక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాను. నా హీరో స‌త్య‌దేవ్‌, సంగీత ద‌ర్శ‌కుడు సునీల్ క‌శ్య‌ప్‌, న‌టుడు `టెంప‌ర్ ` వంశీ, ఇలా నా టీమ్ మెంబ‌ర్స్ చాలా మంది ఈ సినిమాకి ప‌నిచేశారు. ఈ సినిమా క‌థ కూడా నాకు తెలుసు. చాలా బావుంటుంది. సీన్లు కూడా కొన్ని చూశాను. చాలా బావున్నాయి. నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారు నాకెప్ప‌టి నుంచో మిత్రులు. ఆయ‌న కూడా ఈ ప్రాజెక్టులో ఉండ‌టం హ్యాపీ. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి అని అన్నారు.

 

చిత్ర స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ డ‌బ్బింగ్ ప‌నులు పూర్త‌య్యాయి. రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెడుతున్నాం. ఈ నెల‌లోనే పాట‌ల‌ను, టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తాం. సెప్టెంబ‌ర్ 28న ఈ  చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ మా బాస్ పూరి జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా టైటిల్ లోగో లాంచ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. మా బాస్ పుట్టిన‌రోజైన సెప్టెంబ‌ర్ 28న సినిమా రిలీజ్ కావ‌డం ఇంకా హ్యాపీ. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన శ్రీదేవి మూవీస్‌, త‌మిళంలో పేరొందిన నిర్మాణ సంస్థ అభిషేక్ ఫిలిమ్స్... ఇలా ఈ రెండు సంస్థ‌లు కలిసి తీసిన ఈ సినిమాలో హీరోగా చేయ‌డం నా అదృష్టం అని చెప్పారు.

న‌టీన‌టులు:
సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌,  సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, దిల్‌ ర‌మేష్‌ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు :
క‌థ‌:  హెచ్‌.డి.వినోద్‌, అడిష‌న‌ల్ డైలాగ్స్:  పుల‌గం చిన్నారాయ‌ణ‌, సంగీతం:  సునీల్ కాశ్య‌ప్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్:  బ్ర‌హ్మ క‌డ‌లి, కెమెరా: దాశరధి శివేంద్ర,  కో డైర‌క్ట‌ర్‌:  కృష్ణ‌కిశోర్‌,  ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్స్:  ఆర్‌.సెంథిల్‌, కృష్ణ‌కుమార్‌, సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్,  నిర్మాత‌: ర‌మేష్ పిళ్లై, మాటలు -ద‌ర్శ‌క‌త్వం:  గోపీగ‌ణేష్ ప‌ట్టాభి

Facebook Comments
Bluff Master movie title logo poster launched by Puri Jagannath

About uma