Desam Lo Dongalu Paddaru Movie Goes To International Film Festival

ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ కి "దేశంలో దొంగలు పడ్డారు"

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందుతున్న చిత్రం "దేశంలో దొంగ‌లు ప‌డ్డారు". ఈ చిత్రాన్ని సారా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ర‌మా గౌతమ్ నిర్మిస్తున్నారు. గౌత‌మ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... "స్టార్ హిరోలు ఉంటేనే సినిమా చూద్దామని ఆడియన్స్ ఇంతకుముందులా అనుకోవడం లేదు. కొత్త కథలతో, కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. సినిమా చిన్నదా, పెద్దదా అన్న తేడాను పట్టించుకోకుండా.. సబ్జెక్ట్ నచ్చితే చాలు బ్రహ్మారథం పడుతున్నారు. "క్షణం ,పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి, RX100" సినిమాలు సినీ పరిశ్రమలో వచ్చిన మార్పును కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాయి. సరిగ్గా అలాంటికోవకి చెందిన సినిమానే "దేశంలో దొంగలు పడ్డారు". టైటిల్, పోస్టర్స్ నుండి టీజర్ వరకూ ప్రతి విషయంలోనూ విభిన్నంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకొని విడుదలకు ముందే అంతర్జాతీయం స్థాయిలో ప్రసిద్ధిగాంచిన బ్లాక్ బీర్ ("Black Bear" Milford,USA) ఫీల్మ్ ఫెస్టివల్ కి అధికారికంగా నామినేట్ అయ్యింది అక్టోబర్ లో జరిగే ఈ ఫెస్టివల్లొ ఎన్నో అంతర్జాతీయ సినిమాల మధ్య "దేశంలో దొంగలు పడ్డారు" చిత్రం కూడా ప్రదర్శించబడుతుంది. అందరి సహాయసహకారాలు అందుకుని ఈ చిత్రం మరింత ముందుకు వెలుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శేఖ‌ర్ గంగ‌న‌మోని , సంగీతం: శాండీ, ఎడిటింగ్: మ‌ధు. జి. రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, లైన్ ప్రొడ్యూస‌ర్: సాయికుమార్ పాల‌కూరి, స‌హ నిర్మాత‌: స‌ంతోష్ డొంకాడ‌.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%