Driver Ramudu movie completes item song shoot - Social News XYZ
Social News XYZ     

Driver Ramudu movie completes item song shoot

Driver Ramudu movie completes item song shoot

కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న మన  నవ్వుల వీరుడు షకలక శంకర్ . తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా  డ్రైవర్ రాముడు సినిమా ని శరవేగం గా పూర్తిచేస్తున్నాడు. నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోస్ లో భారీ సెట్ లో పవన్ కళ్యాణ్ నటించిన  కెమరామెన్ గంగతో రాంబాబు,రామ్ చరణ్ హీరో గా నటించిన ఎవడు, ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన బాహుబలి లాంటి సినిమా లో తన అంద చందాలతో ఉరూతలూగించిన స్కార్లెట్ విల్సన్ తో మన షకలక శంకర్ ఒక్క ఐటెం సాంగ్ కి చిందులేశాడు. యువతని ఉరూతలూగించే ఈ ఐటెం సాంగ్ కి శివ శంకర్ మాస్టర్ తన స్టెప్స్ లు అందించారు.

ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ "హీరో గా నా మొదటి సినిమా శంభో శంకర ని విజయం చేసిన ప్రతిఒక్కరికి నా కృతఙ్ఞతలు. డ్రైవర్ రాముడు నా రెండో సినిమా. మొదటి సినిమా శంభో శంకర కన్నా చాల అద్భుతంగా వస్తుంది. ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది. నిర్మాతలు, దర్శకుడు ఎక్కడ దేనికి వెనుకాడకుండా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఐటెం సాంగ్ చేస్తున్నాము. ఎన్నో సినిమాలకి పనిచేసిన శివ శంకర్ మాస్టర్ గారి దర్శకత్వం లో ఈ ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా సంతోషం. ఈ సినిమా తో అందరిని అలరిస్తానని నమ్మకం నాకుంది" అని తెలిపారు.

 

డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాట్లాడుతూ "తమిళం లో చాల సినిమాలు చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. తెలుగు సినెమాలవల్లే నాకు ఇంత మంచి పేరు వచ్చింది. నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యాను. ఈ పాట నాకిచ్చిన దర్శక నిర్మాతలకి నా కృతజ్ఞతలు. చాల మంచి పాట చాల బాగా వస్తుంది" అని తెలిపారు.

స్కార్లెట్ విల్సన్ మాట్లాడుతూ "మల్లి తెలుగు సినిమా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రైవర్ రాముడు లో ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా ఆనందం గా ఉంది. శివ శంకర్ మాస్టర్ నా కెరీర్ లో బెస్ట్ కొరియోగ్రాఫేర్. అయ్యన దగ్గర చాలా నేర్చుకున్నాను. దర్శకుడు నిర్మాతకి నా కృతజ్ఞతలు" అని తెలిపారు.

దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ "డ్రైవర్ రాముడు అనేదే పెద్ద ఎన్ టీ ఆర్ గారి సినిమా టైటిల్. ఆ సినిమా కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని ఖచ్చితంగా చోపుతున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు, ఈ సినిమా కూడా అంత విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము. పెద్ద పెద్ద సినిమాలో నటించిన స్కార్లెట్ విల్సన్ మా సినిమా లో ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ పాటకి శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. షకలక శంకర్ నటన, కథ, కథాంశం అద్భుతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది" అని అన్నారు

నిర్మాతలు మాట్లాడుతూ "షకలక శంకర్ గారి శంభో శంకర సినిమా కి మించి మా డ్రైవర్ రాముడు సినిమా ఉంటుంది. పాటలు చాల వస్తున్నాయి. ఈ పాట కి శివ శంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. సునీల్ కాశ్యప్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది.  సినిమా చాలా బాగా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు.

ఈ చిత్రంలో శంకర్, అంచల్ సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా నటిస్తున్నారు.
బ్యానర్- సినిమా పీపుల్స
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్
మ్యూజిక్ - సునీల్ కశ్యాప్
ఆర్ట్ - రఘు కుల్ కర్ణి
డిఓపి - అమర్ నాథ్
నిర్మాతలు - K. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్
దర్శకత్వం - రాజ్ సత్య

Facebook Comments
Driver Ramudu movie completes item song shoot

About uma