'పంతం' బయ్యర్లంతా హ్యాపీగా వుండడం నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది
- నిర్మాత కె.కె.రాధామోహన్
''అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్ టైగర్' వంటి మంచి హిట్ చిత్రాల తర్వాత మా శ్రీసత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో యాక్షన్ హీరో గోపీచంద్‌తో చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'పంతం' అన్ని సెంటర్స్‌లో దిగ్విజయంగా 25 రోజులు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మా చిత్రం చూసి ప్రేక్షకులు చాలా మంది యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా 'పంతం' చాలా బాగుందని అభినందించడం ఆనందాన్ని కలిగించింది.
అలాగే మా చిత్రం కొన్న బయ్యర్లందరూ తమకు కమర్షియల్‌గా ఈ సినిమా చాలా హ్యాపీ ప్రాజెక్ట్ అయిందని చెప్పడం నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. 'పంతం'లాంటి మంచి సినిమా చేసి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా వుంది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అన్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత, సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్ 'పంతం' విజయంపై స్పందిస్తూ.