Social News XYZ     

K.Viswanath Biopic Vishwa Darshanam Movie Launched

వెండితెరకు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ‘విశ్వదర్శనం’

K.Viswanath Biopic Vishwa Darshanam Movie Launched

దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విశ్వదర్శనం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగాయి. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్‌లైన్‌. రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

శుక్రవారం జరిగిన వేడుకలో కె. విశ్వనాథ్‌ దంపతులు పాల్గొన్నారు. సినిమా స్క్రిప్ట్‌ని దర్శకుడు జనార్ధన మహర్షికి కె. విశ్వనాథ్‌ దంపతులు, తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్రసహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల అందజేశారు. ఈ చిత్రానికి  స్వరవీణాపాణి స్వరకర్త. ఈ వేడుకలో విశ్వనాథ్‌గారి దంపతులను సత్కరించారు చిత్రబృందం. ఆరేళ్ల క్రితం జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందిన ‘దేవస్థానం’ చిత్రంలో విశ్వనాథ్‌ ముఖ్య భూమికలో కనిపించారు.

కాగా, ఈ కళాతపస్వి జీవిత చరిత్ర పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తుందని, ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో జనార్ధన మహర్షి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విశ్వనాథ్‌ పుట్టుక నుంచి ఇప్పటివరకూ వివిధ దశలలో ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్రబృందం ప్రకటించనుంది.

Facebook Comments
K.Viswanath Biopic Vishwa Darshanam Movie Launched

About uma