Social News XYZ     

Lucky Media’s 9th movie produced by Bekkam Venugopal titled Hushaaru (Celebration Of Bad Behavior)

లక్కీ మీడియా బ్యానర్ పై  బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న  9 వ చిత్రం 'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం' , ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో  అంతా నూతన తారలే నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు  రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ సినిమా లోగో ని  అగ్రనిర్మాత 'దిల్ రాజు' సోషల్ మీడియాలో విడుదల చేశారు .

 

ఈ సందర్భంగా నిర్మాతబెక్కెం  వేణుగోపాల్ మాట్లాడుతూ -  ''మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే  సినిమా ఇది. కథా కథనాలు  చాలా  ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కిస్తున్నాడు . షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతో0ది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నా0. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

Facebook Comments
Lucky Media's 9th movie produced by Bekkam Venugopal titled Hushaaru (Celebration Of Bad Behavior)

About uma