Social News XYZ     

Jyothika’s Jhansi Teaser Launched By Sudheer Babu

ఝాన్సీ టీజర్ విడుదల చేసిన హీరో సుధీర్ బాబు

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక
ప్రధాన పాత్రలో నటించగా స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు లో కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి తెలుగు టీజర్ ను సమ్మోహనం చిత్రం తో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేసారు.

అయన టీజర్ చూసి "టీజర్ చాల బాగుంది, జ్యోతిక గారిని పోలీస్ ఆఫీసర్ గా చూస్తుంటే వారి శ్రీవారు సూర్య గారు గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటేనే సూర్య గారు గుర్తుకు వస్తారు. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక గారు పోలీస్ ఆఫీసర్ గా సినిమా చేయటం చాల ఆనందం గా ఉంది. తమిళం లో ఈ చిత్రం బారి విజయం సాధించింది ఇప్పుడు తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మన ముందుకు వస్తుంది. టీజర్ చూసాక సినిమా ఖచ్చితంగా చూడాలి అని అనిపిస్తుంది. తెలుగు లో విడుదల చేస్తున్న నిర్మాతలు కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ గారికి అల్ ది బెస్ట్" అని అన్నారు.

 

జ్యోతిక టెర్రిఫిక్ పర్ఫార్మ్యాన్స్, జివి.ప్ర‌కాష్ అద్భుతమైన నటన మరియు ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రం స‌క్సెస్ కి ప్ర‌ధార‌ణ కార‌ణం.

ఇంత భారీ స‌క్సెస్ ని అందుకున్న‌ నాచియార్ మూవీ ఇప్పుడు తెలుగులో మ‌రిన్ని సంచ‌నాలు తెర‌లేప‌టానికి వ‌స్తుంది. తెలుగులోకి వ‌స్తున్న ఈ మూవీకి ఇప్పటికే మార్కెట్ వ‌ర్గాల నుండి పోటా పోటీ బిసినెస్ జరుగుతుంది. త్వరలోనే విడుదల అవుతుంది.

Facebook Comments
Jyothika's Jhansi Teaser Launched By Sudheer Babu

About uma