బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ కథ కొత్తగా వుంది: ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల
బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమా కథపై ఉత్సుకత కలిగిస్తుంది. పోస్టర్‌లో వున్న కొత్తదనం సినిమాలో కూడా వుంటుందనిపిస్తుంది. ఇలాంటి సహజ నేపథ్యంతో కూడిన కథ, కథనాలను ప్రేక్షకులకు చక్కగా ఆదరిస్తున్నారు. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపారు ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగసాయి మాకంను దర్శకుడిగా పరిచయం మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. జగ్గిలొల్లి అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు శేఖర్‌కమ్ముల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు. శ్రీనాథ్ మాగంటి, మేఘన హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక వినూత్నమైన ప్రయత్నం.ఎంటర్‌టైనింగ్‌గా వుంటూనే అందరికి థ్రిల్ల్‌ను కలిగించే చిత్రమిది.తెలంగాణ నేపథ్యంలో కథ నడుస్తుంది. మా చిత్రానికి శేఖర్ కమ్ముల గారి అభినందనలు లభించడం ఆనందంగా వుంది. ఆగస్టు చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ యదార్థ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. పూర్తి సహజమైన కథ, కథనాలతో మనసుకు హత్తుకునే విధంగా వుంటుంది. కామెడీ కూడా సన్నివేశానికి అనుగుణంగా పూర్తి సహజంగా వుంటుంది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. దర్శకుడు శేఖర్‌కమ్ముల చేతుల మీదుగా మా చిత్రం ఫస్ట్‌లుక్ జరగడం ఆనందంగా వుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కెమెరామెన్ తోట.వి.రమణ, ఎడిటర్: ఉద్దవ్ ఎస్‌బి,సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, నిర్మాత మహంకాళి శ్రీనివాసులు, దర్శకుడు నాగసాయి మాకం పాల్గొన్నారు.
This website uses cookies.