నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
పర్యావరణ పరిరక్షణ - పర్యావరణ సమతుల్యతల ప్రాధాన్యతను గుర్తించి ఆ దిశగా కృషి చేయకపోతే భావి తరాల భవిష్యత్తు, ఉనికి ప్రశ్నార్థకమవుతాయి
.. ఈ మాటలు అన్నది ఏ పర్యావరణ శాస్త్రవేత్తో, ప్రభుత్వ అధికారో కాదు.. శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై వరుసగా కాళిదాస్
, కరెంట్
, అడ్డా
, ఆటాడుకుందాం.. రా
చిత్రాలను నిర్మించిన నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు చెప్పిన మాటలివి. సినీ నిర్మాతగా, రియల్టర్‌గా మాత్రమే పరిశ్రమకు, ప్రేక్షకులకు సుపరిచితులైన చింతలపూడి శ్రీనివాసరావు వాస్తవ నేపథ్యం, నైజం వేరు. నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించకముందు ఈనాడు
దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసి.. రాజకీయ, సామాజిక రంగాలతో చక్కని అనుబంధాన్ని కొనసాగించిన శ్రీనివాసరావు.. 2002 నుండి అల్టర్నేటివ్ థెరపీల మీద విశేష పరిశోధనలు చేసి హీలింగ్ స్పెషలిస్ట్
గా ఎంతోమందికి ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించారు. గత 15 ఏళ్ళుగా ప్రాణిక్ హీలింగ్, కార్డ్ హీలింగ్, ఏంజెల్ హీలింగ్, సిద్ధ సమాధి యోగా, సిద్ధా సైన్స్.. వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆచరిస్తూ బోధిస్తున్న చింతలపూడి శ్రీనివాసరావు.. పర్యావరణ ప్రేమికుడిగా కూడా విశేష కృషి చేస్తున్నారు. పంచభూతాత్మకమైన ప్రకృతిలోని గాలి, నీరు, తద్వారా ఆహారం.. కాలుష్యమయం అవడం పట్ల ప్రభుత్వాలు పర్యావరణవేత్తలే కాదు.. గాలి పీల్చి నీరు త్రాగే ప్రతి ఒక్కరూ స్పందించాలి అంటారు శ్రీనివాసరావు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయినా.. కనీసం దాని తీవ్రతను నిరోధించడానికైనా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటున్న శ్రీనివాసరావు.. తన వంతుగా శ్రీ జీ ఎకో ఫౌండేషన్
సంస్థను స్థాపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమ రీతిలో నిర్వహిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి.. వరుసగా 4 చిత్రాలను నిర్మించిన శ్రీనివాసరావు ముగ్గురు కొత్త దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. జర్నలిస్ట్‌గా, నిర్మాతగా, అల్టర్నేటివ్ థెరపిస్ట్‌గా, పర్యావరణ పరిరక్షకుడిగా చింతలపూడి శ్రీనివాసరావు చేసిన కొన్ని విశిష్ట సేవలను గుర్తించి అమెరికాకు చెందిన హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ
వారు జూలై 15న విజయవాడ మనోరమా హోటల్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఆయనను గౌరవ డాక్టరేట్‌తో ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ సమాజంలో నా గౌరవాన్నే కాదు బాధ్యతను కూడా పెంచింది. ఒక పర్యావరణ ప్రేమికుడిగా, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే లక్ష్యంతో `శ్రీ జీ ఎకో ఫౌండేషన్` ద్వారా ఉద్యమ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నాను. పూర్వాశ్రమంలో జర్నలిస్ట్‌ను అయిన నేను జాతీయ స్థాయిలో వ్యవస్థాపించబడిన `మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అకాడమీ ఆఫ్ ఇండియా`లో ట్రస్ట్ మెంబర్‌గా కొనసాగుతున్నాను. అల్టర్నేటివ్ థెరపిస్ట్‌గా, పర్యావరణ పరిరక్షకుడిగా, జర్నలిస్ట్‌గా, సినీ నిర్మాతగా నా సేవలను గుర్తించి నన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన హార్వెస్ట్ బైబిల్ యూనివర్శిటీ వారికి నా కృతజ్ఞతలు
అన్నారు.
మనందరికీ సమర్ధత గల నిర్మాతగా మాత్రమే తెలిసిన చింతలపూడి శ్రీనివాసరావు తన సేవలను ఇతర సేవారంగాలకు కూడా విస్తరించి ఒక వ్యవస్థగా ఎదగడం అభినందనీయం. ఆల్ ద బెస్ట్ టు డాక్టర్ చింతలపూడి శ్రీనివాసరావు
.
This website uses cookies.