Utthara movie first song launched by SV Krishna Reedy

ఉత్తర మొదటి పాటను విడుదల చేసిన ఎస్ వీ కృష్ణ రెడ్డి

లైవ్ ఇన్ సి క్రియేషన్స్  ( Live in C Creations ) మరియు గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్  పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి  దర్శకత్వం లో  శ్రీరామ్, కారుణ్య కాథరిన్  హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో ఎస్ ఆర్ తిరుపతి మరియు శ్రీపతి గంగాదాస్ నిర్మాణంలో  నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి పాటను మరియు మోషన్ పోస్టర్ ను  ప్రముఖ దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి గారు  విడుదల చేసారు.

ఎస్ వీ కృష్ణ రెడ్డి గారు ఈ ఉత్తర చిత్రంలోని "ఓ చూపే" అనే పాటను విడుదల చేసారు, తర్వాత అయన మాట్లాడుతూ "ఉత్తర సినిమాలోని ఈ పాట చాల బాగుంది. హీరో హీరోయిన్ శ్రీరామ్, కారుణ్య కాథరిన్ ఇద్దరు చాల బాగున్నారు. పాట చిత్రీకరణ చాల బాగుంది, లొకేషన్స్ చాల బాగున్నాయి. ఈ సినిమా విజయవంతం కావాలి" అని కోరుకున్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ "మా సినిమా లోని మొదటి పాటను ఎస్ వీ కృష్ణ రెడ్డి గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. కొత్తవాళ్ళమైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న  దర్శకులు ఎస్ వీ కృష్ణ రెడ్డి గారికి మా కృతఙ్ఞతలు. త్వరలో షూటింగ్ పూర్తిచేసుకుని ఆడియో విడుదల చేస్తాం" అని తెలిపారు.

నటి నటులు : శ్రీరామ్, కారుణ్య కాథరిన్, అజయ్ ఘోష్

సంగీతం : సురేష్ బొబ్బిలి
కథ, దర్శకుడు : ఎస్ ఆర్ తిరుపతి
నిర్మాత : ఎస్ ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్
బ్యానర్ :  లైవ్ ఇన్ సి క్రియేషన్స్  ( Live in C Creations ) మరియు గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%