"విజేత" సినిమా జెన్యున్ గా నాకు బాగా నచ్చింది. విజేత వజయోత్సవంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా వారాహి చలన చిత్రం పతాకం పై సాయి శివాని సమర్పణలో రాకేష్ శశి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రజని కొర్రపాటి నిర్మించిన చిత్రం విజేత".ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా రన్ అవుతుంది.ఈ సందర్భంగా విజేత విజియోత్సవం జులై 15న హైద్రాబాద్ ధసపల్లా హోటల్లో గ్రాండ్ గా జరిగింది.ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో కాల్తాన్ దేవ్,హీరొయిన్ మాళవిక నాయర్, నటులు మురళి శర్మ,రాజీవ్ కనకాల,కెమెరామెన్ కె కె సెంథిల్ కుమార్,దర్శకుడు రాకేష్ శశి,నిర్మాత సాయి కొర్రపాటి,ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ"- ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూనే...మరో పక్క చిన్న సినిమాలు చేస్తున్న సాయి కొర్రపాటి గారికి కంగ్రాట్స్.ప్రతి సారి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ..మంచి కంటెంట్ తో మూవీస్ తీస్తున్నారు ఆయన.అందుకే ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్. మంచి కంటెంట్ తో వస్తే ఎప్పటికైనా వారాహి చలన చిత్రంలో సినిమా చేస్తాను.హర్షవర్ధన్ మ్యూజిక్,కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ, రాకేష్ టేకింగ్,సాయి గారి మేకింగ్ వాల్యూస్,రామకృష్ణ సెట్స్,సినిమాకి బిగ్ ఎస్సెట్ అయ్యాయి.ముక్యంగా కళ్యాణ్ అంటే నాకు పర్సనాల్గ చాలా ఇష్టం.ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడా అని ఈగరగా చూసాను.సినిమాల్లో కళ్యాణ్ ని చూడలేదు..ఆ క్యారెక్టర్ని చూసాను. ఎమోషనల్ సీన్స్ లో కంట తడి పెట్టించాడు.అలాగే మురళి శర్మ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు.డైరెక్టర్ రాకేష్ సెకండ్ ఫిల్మ్ అయిన కూడా చాలా బాగా తీసాడు.మాళవిక వాండ్రపుల్ గా చేసింది.మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం.తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం నాకు చాలా చాలా నచ్చింది. సినిమా నచ్చబట్టే ఈ విజయోత్సవానికి వచ్చాను.క్లయిమాక్స్ అయ్యాక టు మినిట్స్ దాకా లేవలేదు. థిస్ ఈజ్ ది బెస్ట్ క్లయిమాక్స్. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మా మెగా ఫాన్స్ కి నా ధన్యవాదాలు అన్నారు.
దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ"- ఈ సినిమా చూసాక చాలామంది కొన్ని వందల మెసేజ్ లు పంపించారు.ఫస్ట్ ఆఫ్ లో కొడుకులు తండ్రిని ఎలా ప్రేమించాలి...సెకండ్ ఆఫ్ లో తండ్రి కొడుకుని వాడి ఇస్థానికి వదిలెయ్యాలి.అప్పుడే మంచి ప్రయోజకులు అవుతారు..అని చాలామంది అప్రిషేయట్ చేస్తున్నారు.సినిమా చాల బాగుంది.తండ్రి కొడుకుల కథ తో జన్యున్ గా మంచి సినిమా చేశారు అంటున్నారు.ఇలాంటి కథని నమ్మి సినిమా తీసిన సాయి గారికి చాలా థాంక్స్.అలాగే చిరంజీవి గారు ఎంతో సపోర్ట్ చేశారు.కళ్యాణ్ దేవ్ ని మంచి కథ తో లాంచ్ చెయ్యాలని ఈ కథ ఒకే చేసి మమ్మలని ఎంకరేజ్ చేశారు.నేను ఏదైతే కథగా రాసుకున్నానో దానికి 10రేట్లు మురళి శర్మ గారు స్క్రీన్ పై చేశారు.అలాగే కళ్యాణ్ కూడా ప్రతిదీ నేర్చుకొని నేచురల్ గా పెర్ఫామ్ చేసాడు.ఈ సినిమాకి వర్క్ చేసిన ఆర్టిస్ట్,టెక్నీషియన్స్ కి థాంక్స్.హర్షవర్దన్ మ్యూజిక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా చేశారు.అన్నారు.
హీరో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ"- వైజాగ్,కాకినాడ,రాజమండ్రి, విజయవాడ, రెండు రోజులనుండి దియటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకోవడం కోసం టూర్ కి వెళ్ళాం..వెరీ అమేజింగ్ రెస్పాన్స్ చాలబాగుంది.ఈ ఎక్సపీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండి పోతుంది.పాదర్స్, స్టూడెంట్స్ చాలామంది మూవీ చూసి వెరీ హార్ట్ టచ్చింగ్ ఫిల్మ్ అని అప్రిషియేట్ చేస్తున్నారు.మురళి శర్మ గారు ఎన్నో సలహాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు.మాళవిక వెరీ గుడ్ పెరఫార్మర్.డైరెక్టర్ రాకేష్ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది.వారాహి చలన చిత్రం బ్యానర్ నుండి ఇంట్రడ్యూస్ అవడం లక్కీగా భావిస్తున్నాను.ఈ అవకాశం ఇచ్చిన సాయి గారికి న కృతజ్ఞతలు. బన్నీ మూవీ చూసి చాలా బాగుంది అని మెచ్చుకొని ఈ ఫంక్షన్ కి వచ్చారు.మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బన్నీకి చాలా థాంక్స్.మా విజేత చిత్రన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు,మెగా ఫాన్స్ కి నా ధన్యవాదాలు.అన్నారు.