జులై 28న సుమంత్ అశ్విన్, నిహరిక ల "హ్యాపి వెడ్డింగ్" కి ముహుర్తం ఖరారు చేసిన యువి క్రియోషన్స్, పాకెట్‌సినిమా
పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు అంటే జీవించినంత కాలం ఓకరినోకరు అర్ధం చేసుకుని ఎటువంటి మనస్పర్థలు రాకుండా జీవించాలని అర్ధం. దీనికి ఇరు పెద్దలు కూర్చుని చక్కటి ముహుర్తాన్ని నిర్ణయిస్తారు.. ముహుర్తం నిర్ణయించిన దగ్గర నుండి రెండు కుటుంబాల్లో వుండే హడావుడి, సంతోషాలు, సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ముహుర్తం అంత గొప్పది.. అలాంటి ముహుర్తాన్ని యువి క్రియెషన్స్, పాకెట్ సినిమా వారు కలిసి సుమంత్ అశ్విన్, నిహరిక ల హ్యపివెడ్డింగ్ కి జులై 28 గా నిర్ణయించారు. అంతే ఇటు ప్రోడక్షన్ హౌస్ లో ప్రమోషన్ హడావుడి మెదలయ్యింది. వెడ్డింగ్ ప్లానర్(పి.ఆర్.వో) ని రంగంలోకి దింపారు. ఏర్పాట్లకి సిధ్ధం చేస్తున్నారు.. త్వరలోనే సంగీత్ కార్యక్రమాలు(సాంగ్స్ విడుదల), ప్రీ-వెడ్డింగ్ (ప్రీ-రిలీజ్ ఫంక్షన్) ని కార్యక్రమాన్ని అత్యంత గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు.
లవర్, కేరింత లాంటి మంచి విజయాలతో యూత్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ వరుడుగా.... అచ్చ తెలుగు చీరకట్టు తో పదహరణాల తెలుగు పిల్ల గా తెలుగు తెరకి పరిచయమయ్యి ప్రతి తెలుగు వారింటి ఆడపడుచులా తన ప్లెజెంట్ నటనతో సుస్థిర స్థానం సాధించుకున్న మెగాప్రిన్సెస్ నిహరిక కొణిదెల వధువుగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా వారు పెళ్ళి పెద్దలుగా ఈ హ్యాపివెడ్డింగ్ కి శ్రీకారాం చుట్టారు. పురోహితుడుగా యంగ్ టాలెంటెడ్ దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ వివాహన్ని చేస్తున్నాడు. మంగళ వాయిద్యాలు(సంగీతం) శక్తికాంత్ అందించగా, ఆర్కెస్ట్రా (రీరికార్డింగ్)- ఎస్.ఎస్.థమన్ అందిస్తున్నారు. పోటోగ్రఫి బాల్ రెడ్డి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ``పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగేరోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా చూపించాం. ప్రతి ఒక్కరి జీవితం లో ఇలాంటి అనుభవం ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమనితాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల , అన్ని వయసుల వారు ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారుఈ చిత్రాన్ని జులై 28న విడుదల చేస్తున్నాము
అని అన్నారు..
నటీనటులు.. సుమంత్ అశ్విన్, నిహారిక, నరేష్, మురళి శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు..
సాంకేతిక నిపుణులు..
యువి క్రియేషన్స్ సమర్పణలో
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్
కెమెరా - బాల్ రెడ్డి
మ్యూజిక్ - శక్తికాంత్ కార్తిక్
పి.ఆర్.ఓ-ఏలూరు శ్రీను
నిర్మాత - పాకెట్ సినిమా
దర్శకత్వం - లక్ష్మణ్ కార్య
This website uses cookies.