With a franchise as powerful and successful as Mission Impossible. one of its most intriguing factors has been it's change of hands vis-a-vis it's directors. There has always been a different director for every move in this franchise. However, this time, on Ethan Hunt aka leading man Tom Cruise's request Christopher McQuarrie became the first filmmaker to ever to return to direct a second Mission: Impossible film.
“One of the signature elements of the franchise is that there has been a different director for every movie,” McQuarrie explains. “When Tom asked me to come back and direct this one I said I would do it on the condition that I could maintain the spirit of that tradition by completely changing the visual language from the previous film. I want people who watch Rogue Nation and Fallout to feel like two different people directed them.”
That was fine with Tom Cruise, who has had a deep admiration for McQuarrie’s ability as a filmmaker since the pair first collaborated on the 2012 action thriller Jack Reacher. “I love working with McQ,” says Cruise. “He is enormously talented. He wanted to change the visual style so it would be as though someone else had directed it, and he succeeded. But it still has his bold storytelling sensibility. I love the toughness of the movie and the characters. We pulled out all the stops. I can’t wait for audiences to see it.”
Releasing on July 27, 2018, ‘MISSION: IMPOSSIBLE – FALLOUT‘– A Paramount Pictures movie, will be exclusively distributed in India by Viacom18 Motion Pictures. The film releases in English, Hindi, Tamil and Telugu.
జులై 27న `మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్`
మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్‌కున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి సినిమాకూ దర్శకుడు మారుతూ ఉండటమే. ఈ వరుసలో ఒక్కో సినిమాకు, ఒక్కో దర్శకుడు పనిచేయడాన్ని గమనించవచ్చు. ఈ సారి హీరో టామ్ క్రూయిస్ మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్
కోసం తనకిష్టమైన దర్శకుడు మెక్ క్వారీని ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరి కలయికలతో రూపొందిన రెండో సినిమా ఇది. ఈ నెల 27న విడుదల కానున్న మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్
గురించి
మెక్ క్వారీ మాట్లాడుతూ నన్ను టామ్ కలిసి `మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్`ను దర్శకత్వం చేయమని అడిగినప్పుడు నేను ఆయనతో ఒకటే చెప్పా. ఇంతకు మునుపు సినిమాలకన్నా ఈ సినిమాలో దృశ్యపరంగా పెద్ద మార్పు తీసుకుని వస్తాను అని. గత చిత్రాలను చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మరొకరు అని ఇట్టే తెలియాలన్నది నా ఫీలింగ్
అని చెప్పారు.
టామ్ క్రూయిస్ మాట్లాడుతూ నేను 2012లో మెక్ క్వారీతో యాక్షన్ థ్రిల్లర్ `జాక్ రీచర్` చేశాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. అత్యద్భుతమైన ప్రతిభావంతుడు. మా `మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్`లో విజువల్ స్టైల్‌లో మార్పులు చేయాలనుకున్నారు. అంతకు మునుపు ఇంకెవరో చేసినదే అయినా, ఆయన తన మార్కు ఉండాలనుకున్నారు. అనుకున్న ప్రకారమే విజయాన్ని సాధించారు. ఇందులో ఆయన బోల్డ్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని గమనించవచ్చు. ఈ సినిమాలో కథలోని క్లిష్టత, పాత్రల తీరుతెన్నులు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధమయ్యాం. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అనే ఆకాంక్షతో ఉన్నాను
అని అన్నారు.
పారామౌంట్ పిక్చర్స్ తెరకెక్కించిన మిషన్ ఇంపాజిబుల్ - ఫాలౌట్
ఈ నెల 27న విడుదల కానుంది. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగులో విడుదల చేయనుంది.
This website uses cookies.