Top comedian Prudhvi is playing a defence lawyer in 'My Dear Maarthandam', a courtroom drama and crime comedy. Made on Mazin Movie Makers banner, the film marks the debut of writer-director Harish KV.
The makers are glad to inform that the film's production works were recently wrapped up. Post-production works are being completed.
Releasing the First Look, producer Sayed Nizamuddin says, "We are happy to be working with Prudhvi garu, who has made a mark with his unique style of comedy. He becomes a lawyer by reading a book titled 'How to become a lawyer in 30 days'?. His comedy is the film's major highlight. We are going to release a teaser very soon."
Jayaprakash Reddy, Krishna Bagawan, Rakendu Mouli, Kalpika Ganesh, Kalyan Vittapu, Thaagubothu Ramesh, Sudarshan, Gokul, Jabardasth Prasad, Harish Koyalagundla and Mahesh Vitta are part of the cast.
Music is by Pavan. Cinematography is by Ryamdy. Editing is by Garry BH. Art direction is by Praveen.
పృథ్వీ (థర్టీ ఇయర్స్) టైటిల్ పాత్రలో `మై డియర్ మార్తాండం` ఫస్ట్ లుక్ విడుదల
థర్టీ ఇయర్స్ ఇక్కడ.. అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ కమెడియన్ పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం మై డియర్ మార్తాండం
. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ... నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ - కమెడియన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న పృథ్వీగారు టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. "ముప్పై రోజుల్లో లాయర్ అవడం ఎలా"? అనే పుస్తకాన్ని చదివిన డిఫెన్స్ లాయర్ పాత్రలో పృథ్వీగారి నటన సినిమాకే హైలైట్ కానుంది. క్రైమ్ కామెడీగా కోర్టు రూమ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పస్ట్‌లుక్ విడుదల చేశాం. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం
అన్నారు.
పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్, కల్పిక గణేశ్, కల్యాణ్ విట్టపు, తాగుబోతు రమేశ్ తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప‌్రవీణ్, మ్యూజిక్: పవన్, ఎడిటింగ్: గ‌్యారీ బి.హెచ్, సినిమాటోగ్రఫీ:ర‌్యాండీ, నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్, రచన, దర్శకత్వం: హరీష్ కె.వి
This website uses cookies.