`రంగస్థలం` 100 డేస్ సెలబ్రేషన్స్
రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన 100 డేస్ సెలబ్రేషన్స్
కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో..
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ - మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, సుకుమార్, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్‌గారికి థాంక్స్. ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. సినిమా 100 రోజులు ఆడిందంటే.. ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉందో మనకు తెలిసిందే. అయితే ఒక క్లారిటీ మాత్రం ఉంది. ఒక మనిషి ఆలోచనే ఈ సినిమా. ఆ మనిషే సుకుమార్. ఆయన రైటింగ్ నుండి ఈ సినిమా మొదలైంది. ఆయన ఆలోచన, మొండి బలం ఈ సినిమా స్టార్ట్ కావడానికి కారణం. ఆయన కలే ఈ సినిమా. ఆయన ఆలోచన వల్లే నేను, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్ సహా ఎందరో పనిచేశాం. ఆయన ఆలోచనా స్థాయి వంద రోజుల వరకు తీసుకొచ్చింది. ఆ వ్యక్తికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అది పవర్‌ఫుల్ ఆలోచన. నా మోస్ట్ లవబుల్ నిర్మాతలు మైత్రీ నిర్మాతలు. రత్నవేలుగారితో ఖైదీ నంబర్ 150తో పనిచేశాను. మళ్లీ ఈ సినిమాకు చేశాను. ఇప్పుడు మళ్లీ సైరా నరసింహారెడ్డికి కూడా పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి పాటలకు నా డాన్స్ మాస్టర్స్ ఎంతో కష్టపడి నాతో డాన్స్ చేయించారు. అలాగే రంగమత్త క్యారెక్టర్‌ను అనసూయగారు బ్యూటీఫుల్‌గా చేశారు. సమంతగారికి, ప్రకాశ్‌రాజ్‌గారికి, ఆది పినిశెట్టిగారు, జగపతిబాబుగారు సహా అందరికీ థాంక్స్. మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం మన తల్లిదండ్రుల నుండి.. గురువుల నుండి నేర్చుకుంటూ ఉంటాం. నాన్నగారు ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, ప్రేమ ఎందుకు వస్తాయని ఆలోచించేవాడిని. గొప్ప క్యారెక్టర్స్ వల్లనో, మంచి సినిమాల వల్లనో ఆదరణ రాదు.
ఎదిగేటప్పుడు మనతో పాటు పది మంది పైకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే.. ఆ పదిమందే మనల్ని కాపాడుతారుఅని నాన్నగారు చెప్పేవారు. మమ్మల్ని, మా ఇండస్ట్రీని కాపాడేవాళ్లు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. వాళ్లు సంతోషంగా ఉంటే.. మేం సంతోషంగా ఉన్నాం. ఈ సినిమా ద్వారా వాళ్లకు లాభాలు వచ్చాయి. సంతోషంగా ఉన్నారు. నా సినిమా అనే కాదు.. ప్రతి సినిమాకు వాళ్లు సంతోషంగా ఉండాలి. ఇండస్ట్రీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను
అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ - కథ విన్న వెంటనే చరణ్ ఓకే చెప్పి ఉండకపోతే.. వేరే కథతో సినిమా చేసేవాడిని. అయితే రంగస్థలం సినిమా రావడానికి ముఖ్య కారణం చరణే. ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి మూల కారకుడు చరణ్. నిర్మాతలు నవీన్, రవి, మోహన్‌గారు.. చాలా అందమైన నిర్మాతలు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఈ సక్సెస్ గురించి వాళ్లు నాతో చెబుతూనే ఉన్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. నా సోదరుడు రత్నవేలు లేకుండా విజువల్స్ ఇంత బాగా వచ్చేవి కావు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ నా ఆత్మ. అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి... సినిమా మేకింగ్‌లో సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరునా థాంక్స్
అన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - ఈరోజుల్లో వందరోజులు సినిమాలు ఆడుతున్నాయా? అలాంటి ఈరోజుల్లో వందరోజుల సినిమాను ఇచ్చిన రామ్‌చరణ్‌గారు, సుకుమార్ సహా అందరికీ స్పెషల్ థాంక్స్. మా జీవితంలో మెమరబుల్ మూమెంట్. ఇదొక అద్భుతం. ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ థాంక్స్
అన్నారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ - రంగస్థలం సినిమాకు పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్
అన్నారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు థాంక్స్. సుకుమార్‌గారికి థాంక్స్. చరణ్‌గారు జిగేల్‌రాణి పాటలో చక్కగా చేశారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్
అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, బ్రహ్మాజీ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.