ట్రెండీ కథాంశంతో `శుభలేఖ+లు`
శుభలేఖలు అనే పదం వినగానే పెళ్లి తంతు గుర్తుకొస్తుంది. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జరిపించాలని పెద్దలు అంటారు. పెళ్లికి చెప్పే అబద్ధం తప్పు కాదని, రెండు మనసులను కలపడానికి చేసే మంచి ప్రయత్నమని వారి భావన. కానీ నేటి ట్రెండ్‌లో పెళ్లి అంటే సత్యం
అనే ధోరణి మొదలైంది. ఇప్పుడు పెళ్లి కోసం ఆడే అబద్ధాలను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి విషయాలను డిస్కస్ చేస్తూ చాలా ఇన్నొవేటివ్ కథాంశంతో శుభలేఖ+లు
చిత్రం రూపొందుతోంది. శరత్ నర్వాడే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి.విద్యాసాగర్, ఆర్.ఆర్.జనార్దన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లు. ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రధారులు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు సి.విద్యాసాగర్, ఆర్. ఆర్. జనార్దన్ మాట్లాడుతూ వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ ఈ జనరేషన్ దానికి అసలు అంగీకరించడం లేదు. పెళ్లి అయినా, ఇంకేదైనా సరే నిజం దాయకూడదంటున్నారు. ఫలితం ఎలా ఉన్నా వాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాగే కథ ఇది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపాం. కేఎమ్ రాధాకృష్ణన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఆరు పాటలున్నాయి. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం
అని అన్నారు.
అప్పాజీ ,డా . ఇర్ఫాన్ , తిరువీర్,సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ - మాటలు: జనార్దన్ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: మధు, ఆర్ట్: బ‌్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరత్ నర్వాడే.
This website uses cookies.