Trinetri movie completes shoot

షూటింగ్ పూర్తిచేసుకున్న త్రినేత్రి, త్వరలోనే టీజర్ విడుదల

ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణం లో  లక్షిత ఆర్ట్స్ పతాకం పై తిరుపతి కె వర్మ దర్శకత్వం లో ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించబడుతున్న చిత్రం త్రినేత్రి. మేఘన,ఆరోహి మరియు వృశాలి ముఖ్య తారాగణం తో పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నిర్మించబడుతుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు ఎడవెల్లి వెంకట్ రెడ్డి,కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ "లక్షిత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడుతున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి త్రినేత్రి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాము .  మా సినిమా లో పోసాని కృష్ణ మురళి చేయటం మా అదృష్టం. వారికీ మరియు ఇతర నటి నటులకి మా కృతఙ్ఞతలు . పోసాని గారు మా సినిమా కథ విని కథ చాల బాగుంది, ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తియింది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల. కరీంనగర్ వంటి వాస్తవిక లొకేషన్ లో షూటింగ్ చేశాం.  నిర్మాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తాం " అని తెలిపారు.

దర్శకుడు తిరుపతి కె వర్మ మాట్లాడుతూ "ఇది ఆడవారికి సంభందించిన సినిమా. ప్రతిఒక్క మహిళా చూడదగ్గ సినిమా. ఇవాళ సమాజం లో ఆడవాళ్లపై జరుగుతున్నా యదార్ధ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆడవాళ్లు తిరగబడితే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ. మా త్రినేత్రి సినిమా అందరిని అల్లరిస్తుంది. పోసాని కృష్ణ మురళి గారు కీలక పాత్రలో చేస్తున్నారు. వారి పాత్ర ఈ సినిమా కి హైలైట్ గా ఉంటుంది. మేఘన,ఆరోహి మరియు వృశాలి ముఖ్య తారాగణం తో నిర్మించబడుతున్న ఈ చిత్రానికి ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలు. వారు నా కథ విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు వారికీ నా ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తాం" అని తెలిపారు.

బ్యానేర్ :  లక్షిత ఆర్ట్స్
సమర్పణ : ఎడవెల్లి రాంరెడ్డి,
నిర్మాతలు : ఎడవెల్లి వెంకట్ రెడ్డి,కాచిడి గోపాల్ రెడ్డి,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తిరుపతి కె వర్మ
సినిమా ఆటోగ్రాఫి:V V S చారి
రైటర్ : హర్ష
మ్యూజిక్ డైరెక్టర్:జయంత్
పాటలు: అడ్డిచర్ల సాగర్,మండిగం రాము,M శ్రావణ్
నటీనటులు:మేఘన,ఆరోహి,వృశాలి,పోసాని కృష్ణమురళి,జబర్ధస్థ్ అప్పారావు,జయవాణి,కుమార్ వర్మ,చంద్రం,రమేష్ వర్మ, కాచిడి గోపాల్ రెడ్డి, శ్యాం, అసిఫ్, విక్రమ్

Facebook Comments

About uma

Share

This website uses cookies.