Social News XYZ     

Ee Nagaraniki Emaindi success meet held

ఈ నగరానికి ఏమైంది సక్సెస్ మీట్.

Ee Nagaraniki Emaindi success meet held

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపడుతుంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు చిత్ర నటీనటులు పాల్గొన్నారు. అలాగే కేర్ అఫ్ కంచరపాలెం చిత్ర యూనిట్, ఆ చిత్ర  దర్శకుడు వెంకటేష్ మహా  పాల్గొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేసారు.

 

ఈ సంధర్బంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ...

"ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందరికి అభినందనలు తెలుపుతున్నాను. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. దయచేసి సినిమాను పైరసిలో చూడకండి. ధియేటర్ లో మూవీని చూసి ఆనందించండి. ఈ సమయంలో కేర్ అఫ్ కంచరపాలెం సినిమా పోస్టర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. దగ్గుబాటి రానా ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అన్ని వివరాలు తెలుపుతాము"  అన్నారు.

దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..

"కొత్త నటినటుల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదాలు. ఆడియన్స్ నుండి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాలో ఎక్కడా అశ్లీలత లేదు. కుటుంభ సభ్యులు అందరు సినిమాను చూసి ఆనందించే విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమా చేస్తే మీకు మీ పాత మెమోరీస్ గుర్తుకు వస్తాయి" అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ...

"మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి థాంక్స్. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి, నిర్మాత సురేష్ బాబు గారికి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాను" అన్నారు

హీరోయిన్ అనీషా అంబ్రోస్ మాట్లాడుతూ...

"సినిమా చూసిన అందరు బాగుందని చెబుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికి థాంక్స్. దయచేసి సినిమాను థియేటర్స్ లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చెయ్యొద్దు. పైరసీ లింక్స్ మా మూవీ పేజ్ కు సెండ్ చెయ్యండి" అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ...

"సినిమా రిలీజ్ అయ్యాక నా ఫ్రెండ్స్ చాలామంది టికెట్స్ కోసం కాల్ చేస్తుంటే సంతోషంగా ఉంది. తరుణ్ భాస్కర్ కొత్త వారితో సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. కొత్తవారిని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు" అన్నారు.

అభినవ్ గోమతం మాట్లాడుతూ...

"ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ కి, నిర్మాత సురేష్ బాబు గారికి థాంక్స్. నా పాత్రకు అందరినుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు" అన్నారు.

Facebook Comments
Ee Nagaraniki Emaindi success meet held

About uma

%d bloggers like this: