‘విశ్వామిత్ర’లో నందితా
‘గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్ తో మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెల ప్రారంభమైన విషయం తెలిసిందే. పది రోజులుగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంది. 'ప్రేమకథా చిత్రమ్' ఫేం నందితా ఇందులో కథానాయిక. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ ‘నందితా’ ఇంట్రడక్షన్, సినిమాలో కీలకమైన పోలీస్‌స్టేషన్ సీన్లను ప్రముఖ నటుడు ప్రసన్నపై చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ – ‘‘స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లుగానే ఈ సినిమా కూడా అదే థ్రిల్ మెయింటేన్ చేస్తుంది. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్: ఉపేంద్ర, ఆర్ట్–చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: రాజకిరణ్
This website uses cookies.